Ismart Anjali : టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ చదువుతూ బాగా ఫేమస్ అయిన తెలంగాణ అమ్మాయి ఆరోహి రావు అలియాస్ ఇస్మార్ట్ అంజలి బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఇక ఇపుడు అంజలి నేపధ్యం గురించి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి బిగ్ బాస్ ప్రేక్షకులు వెతకడం మొదలు పెట్టారు. అంజలి అసలు పేరు ఆరోహి రావు సొంతూరు పరకాల దగ్గర పల్లెటూరు. అమ్మ చిన్నతనంలో మరణించడం తో నాన్న మరో పెళ్లి చెసుకోవడం గొడవల కారణంగా అమ్మమ్మ వద్ద పెరిగింది ఆరోహి రావు, ఇక ఆరోహికి ఒక అన్న ఉన్నాడు. ఇక పదో తరగతి వరకు పల్లెటూరు లో చదివిన ఆరోహి ఆ తరువాత వరంగల్ కు వెళ్లి పై చదువులు అక్కడ్ చదివింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవడంతో ఎంతో బాధను అనుభవించానని ఈ ప్రపంచంలో మనకు ఎవరు తోడు ఉండరని ఒంటరి అనే భావన చిన్నవయసులోనే వచ్చేసిందని చెప్పింది ఆరోహి రావు.
వరుసకు అన్న అయ్యే వాడే నాపై అత్యాచారం చేయాలని అనుకొన్నాడు…
చాలా మంది అమ్మాయిలు తెలియని వయసులో సెక్సువల్ అబ్యూస్ కి గురవుతు ఉంటారని ఏది వాళ్లకు తెలియకుండానే జరుగుతుందని నాకు అలానే తెలియని వయసులో జరిగిందంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఇస్మార్ట్ అంజలి పంచుకున్నారు. ఏమి తెలియని వయసులో బంధువే అయిన అన్న నా మీద అత్యాచార యత్నం చేసాడు నాకు ఏది తెలియక కొడుతున్నాడని అరిచాను దాంతో ఇంట్లో వాళ్ళు రావడం అతను పారిపోవడం జరిగింది అంటూ మళ్ళీ పెద్దయ్యాక ఆ సంఘటన గుర్తొచ్చినపుడు అర్థమైంది నాకు ఏం జరిగిందో ఇలాంటివి ఇక కొంచెం అవగాహన వచ్చాక జరగలేదు ఎవరిని దగ్గరకు రానిచ్చేదాన్ని కాదు. ఒక ఫోభియా లో చాలా రోజులు బతికాను అంటూ అంజలి తన అనుభవాలను చెప్పింది.
ఇక మీడియా రంగంలోకి వచ్చాక చిన్న చిన్న సంఘటనలు ఉన్న నేను చాలా స్ట్రాంగ్ అందుకే అలాంటివి జరగలేదు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నపుడు మన బాధ షేర్ చేసుకోడానికి అమ్మ ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ నాకావకాశం లేదు అలా చాలా క్రుంగిపోయిన రోజులు ఉన్నాయి. కానీ వాటి వల్లే నేను చాలా మొండిగా, స్ట్రాంగ్ గా తయారయ్యాను. ఒక ఆడపిల్లకు తననతో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అర్థమైపోతుంది, ప్రతి ఆడపిల్లకు నేను చెప్పేది ఒకటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎక్కడా ఆత్మభిమానం కోల్పోకూడదు. మనకు నచ్చిన పని చేసిన ఎవరి దగ్గర దిగజారాల్సిన పనిలేదు అంటూ చెప్పింది. లైంగిక దాడి జరిగినపుడు ఇంట్లో వాళ్లకు చెబితే తిడతారేమో అని భయపడటం, పరువు పోతుందని ఆలోచించడం మానేయండి తప్పు చేస్తే అలా ఆలోచించాలి అంటూ చెప్పింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…