Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్ కు జియో పేరుతో కుచ్చుటోపి.. పోలీసుల అదుపులోకి నిందితుడు!

Jeevitha Rajasekhar:టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరగాళ్లు కూడా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు వరకు ఎంతో సునాయసంగా మోసపోతు లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి జీవిత రాజశేఖర్ కు ఒక ఫోన్ కాల్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యారు. తన పేరు ఫారుక్ అని పరిచయం చేసుకొని మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది తానేనట్టు పరిచయం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా జియో సేవలలో 50 శాతం డిస్కౌంట్ పేరుతో ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కొని చేసే ఆఫర్ ఉందని చెప్పారు. అయితే జీవిత ఏదో పనిలో ఉండి ఈ విషయాలన్నీ తన మేనేజర్ తో మాట్లాడాలని సూచించారు. ఈ క్రమంలోనే అటువైపు నుంచి ఆ వ్యక్తి జియో ఆఫర్ పేరిట రెండున్నర లక్ష రూపాయలు విలువ చేసే వస్తువులను ఆఫర్ ధరలో మీరు 1.25 లక్షల రూపాయలకే కొనుగోలు చేయవచ్చు అంటూ చెప్పారు.

ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ఆఫర్లు రావడంతో జీవిత మేనేజర్ సదరు వ్యక్తి అకౌంట్ కు 1.25లక్షల రూపాయలు నగదును ట్రాన్స్ఫర్ చేశారు.ఇలా డబ్బు పంపిన తర్వాత అవతలి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దీంతో తాను మోసపోయానని గ్రహించిన జీవిత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి పోలీసులకు జరిగిన విషయం మొత్తం తెలియజేశారు.

Jeevitha Rajasekhar: పోలీసుల అదుపులోకి నిందితుడు నరేష్..


ఈ క్రమంలోనే పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ జరపగా ఆ వ్యక్తి ఫారుక్ కాదని గుర్తించారు.జియో ఆఫర్ పేరిట జీవిత రాజశేఖర్ దంపతులకు కుచ్చుటోపి పెట్టిన వ్యక్తి చెన్నైకి చెందిన నరేష్ అని పోలీసులు గుర్తించడమే కాకుండా తనని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎంతోమంది ప్రతి రోజు సైబర్ నేరగాళ్ల మాయలో పడి పెద్ద ఎత్తున డబ్బును మోసపోతున్నారు.