Kamal Hassan: నా సినిమాలలో రాధిక వద్దు… దర్శక నిర్మాతలకు ఆర్డర్ వేసిన కమల్ హాసన్.. ఏం జరిగిందంటే?

Kamal Hassan: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత నటీనటుల మధ్య ఇతర చిత్ర బృందం మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడం సర్వసాధారణం ఇలా షూటింగ్ లొకేషన్లో అనుకోకుండా జరిగిన గొడవల కారణంగా కొంతమంది మాట్లాడుకోవడమే మానేసి తిరిగి సినిమాలలో కూడా నటించిన దాఖలాలు లేవు. ఇలా ఎంతో మంది సీనియర్ హీరోల మధ్య కొన్ని సంవత్సరాల పాటు మాటలు లేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఈ క్రమంలోనే కమల్ హాసన్ రాధిక జంటగా నటించిన స్వాతి ముత్యం సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే తరువాత కమల్ హాసన్ రాధిక కాంబినేషన్లో ఎలాంటి సినిమాలు రాలేదు ఇలా సినిమాలు రాకపోవడానికి గల కారణం తన సినిమాలలో రాధికను తీసుకోవద్దు అంటూ దర్శక నిర్మాతలకు సూచించారట ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి అసలు వీరి మధ్య ఎలాంటి గొడవ చోటుచేసుకుంది అనే విషయాన్నికి వస్తే…

అది 1977 టైం.. సూపర్ స్టార్ కృష్ణ, ఆయన పెద్ద కొడుకు రమేష్ బాబు, రోజా, రాధిక తదితరులు ప్రధాన తారాగణంగా.. ఎన్.శంకర్ దర్శకత్వంలో ‘ఎన్‌కౌంటర్’ అనే సినిమా వచ్చింది అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఈ సినిమా వేడుకలో భాగంగా రాధిక మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ కాలేకపోయినా తల్లిగా తాను చేసిన పాత్రకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కమల్ హాసన్ నటించిన భారతీయుడు మైఖేల్ మదన కామరాజు సినిమాలలో కూడా నేనే నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వలన నటించలేకపోయినాను అయితే ఈ సినిమాలో నటించినందుకు నాకు బాధగా లేదని తెలిపారు.

Kamal Hassan: నిరోషాను తిట్టిన కమల్..

ఈ సినిమాలో ముందుగా దర్శక నిర్మాతలు నన్ను అనుకున్న కమల్ హాసన్ పెట్టద్దని చెప్పారట. అయినా నాకు బాధ లేదు కానీ కొందరు బుద్ధులు అలాగే ఉంటాయని ఈమె కమల్ గురించి మాట్లాడటంతో ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.అలాగే తన చెల్లెలు నిరోషాతో కలిసి లిప్ లాక్ చేసేటప్పుడు కమల్ హాసన్ అసభ్యంగా ప్రవర్తించారని అలా వద్దన్నందుకు తన చెల్లెలు ఇష్టానుసారంగా తిట్టారని రాధిక చెప్పారట.ఇక తనతో కమల్ హాసన్ కునేరుగా గొడవలు లేవు కానీ తన భార్య సారిక మాత్రం ఒక వ్యక్తి దగ్గర తన గురించి చెడుగా చెప్పిందని నాకు తెలిసింది అయితే నేను కూడా తనకు అలాగే వార్నింగ్ ఇవ్వడంతో కమల్ హాసన్ సినిమాలలో తనకు అవకాశాలు ఇవ్వకూడదని చెప్పి సారిక అడ్డుకుందని రాధిక ఓ సందర్భంలో తెలిపారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్లు తిరిగి సినిమాలు రాలేదు.