Singer Yashaswi : జీ తెలుగు సరిగమప సింగింగ్ ద్వారా సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యశస్వి కి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. యశస్వి జాను సినిమాలోని ది లైఫ్ అఫ్ రామ్ సాంగ్ పాడి ఒక్కసారిగా అందరి మనసును దోచుకున్నారు. ఒరిజినల్ సింగర్ కన్నా ఆ సాంగ్ అద్భుతంగా పాడాడంటూ ప్రశంసలు అందుకున్న యశస్వి మరోవైపు వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటూనే అలానే యూట్యూబ్ ఛానెల్ ద్వారా సాంగ్స్ పాడుతూ అందరికీ చేరువవుతున్నాడు. తాజాగా యశస్వి ఒక సేవా సంస్థకు పని చేస్తున్నట్లు అలానే ఆ సేవా సంస్థకు సహాయం చేస్తున్నట్లు వస్తున్న వార్తల నడుమ అవన్నీ అపద్దలు అంటూ ఆ సేవా సంస్థ మెంబెర్ మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో ఒక్కసారిగా యశస్వి వైరల్ అవుతున్నాడు. ఇక ఈ విషయాల మీద తనపై వచ్చిన ఆరోపణల మీద క్లారిటీ ఇచ్చాడు సింగర్ యశస్వి.
నాకు ఆ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు…
ఒక ప్రముఖ ఛానెల్ కోసం తాను చేస్తున్న సహాయ కార్యక్రమాలను వీడియో రూపంలో ప్రోమో వేయడంతో యశస్వి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. తాను సహాయం చేయకపోయినా చేసినట్లు సింగర్ యశస్వి చెప్పుకుంటున్నాడు అంటూ నవసేన ఫౌండేషన్ మెంబెర్ ఫరా కౌసర్ ఆరోపణల నడుమ యశస్వి ఈ విషయాల మీద క్లారిటీ ఇచ్చాడు. అసలు ఆ ఫౌండేషన్ కు నాకు ఎటువంటి సంబంధం లేదని, ఎపుడూ ఆ ఫౌండేషన్ కి వెళ్ళలేదంటూ చెప్పారు. అయితే సాధ్యం అనే ఎన్జీఓకి అప్పుడప్పుడు సహకారం అందించడం చేసేవాడినని చెప్పారు. అలా సాధ్యం ఎన్జీఓ వాళ్ళు నవసేన ఫౌండేషన్ లాంటి ఎన్నో ఫౌండేషన్స్ కి సహాయం చేస్తారని, అలా నవసేన కు సహాయం చేసినపుడు తీసిన ఫోటోలను వీడియోలో చూపించినపుడు ఆ సంస్థ బోర్డు కనిపించడం వల్ల సమస్య వచ్చిందని తెలిపారు.
ఫరా కౌసర్ తో మాట్లాడినప్పుడు సహాయం చేయకుండా అమ్మా పిల్లలను వాడుకున్నారు, ఆరు నెలలు సంస్థను దత్తత తీసుకోండి అని చెప్పారు. నేనందుకు తీసుకోవాలి అని అనే సరికి లీగల్ గా చూసుకుందాం అని అన్నారు అంటూ యశస్వి తెలిపారు. ఆమె అభ్యంతరం తెలిపాక ఇక వీడియోలో వాళ్ళను చూపించలేదు. అయితే అసలు వీడియోలో ఎక్కడా నేనే ఆ ఫౌండేషన్ ను ఆ పిల్లలు బాధ్యతను తీసుకున్నట్లు చెప్పలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు యశస్వి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…