Featured

Character Artist Hema : ఇంట్లో చెప్పకుండా ఒక ముస్లిం వ్యక్తిని నమ్మి పెళ్లి చేసుకున్నా… ఆరోజు చితక్కొట్టుడు కొట్టారు…: నటి హేమ

Character Artist Hema : తెలుగులో హీరోయిన్ స్నేహితురాలిగా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన హేమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. హేమ అసలు పేరు కృష్ణ వేణి, తనది రాజోలు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా బాగా వైరల్ అయిన హేమ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఆ మధ్య మా ఎన్నికల సమయంలో శివబాలాజీ తో గొడవ, కొరకడం వంటి విషయాలతో బాగా వైరల్ అయింది హేమ. ఇక హేమ ఎవరి గురించైనా ఏ మాత్రం జంకు లేకుండా ఫ్రాంక్ గా మాట్లాడేస్తుంది.

ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే… చితక్కొట్టారు…

దూరదర్శన్ లో పనిచేసే సమయంలో డైరెక్టర్ మీర్ గారి ద్వారా ఆయన తమ్ముడు అసిస్టెంట్ కెమెరా మెన్ గా ఉన్న సయ్యద్ జాన్ అహమ్మద్ పరిచయం అయ్యాడు. అయితే నా స్నేహితులతో ఎగ్జిభిషన్ వెళ్లాలనుకుంటే తాను వస్తానని అడిగాడు. ఇక అలా ఏర్పడిన పరిచయంతో మొదటి రోజే పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. ఆ తరువాత మాట్లాడటం, కలవడం లాంటివి చేసేవాళ్ళం.

ఇంట్లోవాళ్ళకి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. నేను, అహమ్మద్ కలిసి తిరుగుతున్నామని ఏదో చేయబోతున్నామని మా అమ్మకు వాళ్ళ అన్న మీర్ ఫోన్ చేసి చెప్పడంతో ఆ రోజు మా అమ్మ బాగా చితక్కొట్టింది అంటూ హేమ తెలిపారు. అయితే ఆ తరువాత అనుకున్న ప్రకారమే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం. విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు, ఇక ఇరువైపులా ఒప్పుకుని రిసెప్షన్ చేసారు. అలా 18 ఏళ్లకే పెళ్లి చేసేసుకున్నాను అంటూ హేమ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago