KCR : సారూ.. కారూ.. కేసీఆరూ.. మళ్ళీ తూలుతుండు.. మందు కొట్టిండా.. మానేసిండా.. ఈ వీడియోకి అర్థాలే వేరులే..!

KCR : మహారాష్ట్రలో పాగా వేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడో సారి సభ నిర్వహించారు. బీఆర్ఎస్‌కి మహారాష్ట్రలో ఏం పని అని ప్రశ్నించిన ఫడ్నవీస్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ లాంటి మోడ‌ల్ మ‌హారాష్ట్రలో తీసుకొస్తే తానెందుకు వస్తానని ప్రశ్నించారు. మ‌హారాష్ట్రలో ద‌ళిత‌బంధు, రైతుబంధు అమ‌లు చేయాలని.. 24 గంట‌ల క‌రెంట్ ఇవ్వాలని.. ఇవ‌న్నీ అమ‌లు చేస్తే మాత్రం తాను మహారాష్ట్రలో అడుగు పెట్టబోనని తెలిపారు. తన ప్రసంగానికి సెంటిమెంట్ టచ్ కూడా ఇచ్చి దళితులకు చేరువయ్యేందుకు యత్నించారు. అంబేద్కర్ జ‌న్మించిన నేల‌పై ద‌ళితుల‌ను ప‌ట్టించుకోరా..? అంటూ ప్రేమ కురిపించారు. ద‌ళిత‌బంధు లాంటి ప‌థ‌కం మ‌హారాష్ట్రలో ఎందుకు అమ‌లు చేయ‌రని అక్కడి సర్కార్‌ను నిలదీశారు. నూత‌నంగా నిర్మించే పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దళితులను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. ఇంకేముంది.. వారంతా ఫిదా.

ఇంత చక్కగా మాట్లాడిన కేసీఆర్.. తన ప్రసంగానికి ముందు స్టేజ్ ఎక్కుతూ కాస్త తడబడ్డారు. కాస్త తూలుతూ నడుస్తున్నట్టుగా కనిపించారు. దీంతో ఇదే చాన్స్‌ అన్నట్లు విపక్షాల సోషల్‌ మీడియా ప్రతినిధులతోపాటు, కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను తమకు నచ్చిన పాట జోడించి ట్రోల్‌ చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? సాంగ్ ఏసి మరీ ఆడుకుంటుున్నాయి. ఇటీవలి కాలంలో ఒక ఫ్యాన్ కంపెనీ యాడ్ అనేది టీవీ ఛానళ్లలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సమ్మర్ కదా.. సదరు ఫ్యాన్ కంపెనీ కాస్త గట్టిగానే యాడ్ కోసం డబ్బు ఖర్చు చేసింది. ‘ఇండియా ఊగులాడుతోంది’ అనే పాటతో యాడ్ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్ గాలికి ఇండియా ఊగడమేంటి? ఫన్నీగా అనిపిస్తోంది కదా. ఒక ఫన్నీ ఎలిమెంట్‌తో ఈ యాడ్ బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ యాడ్ గోలెందుకంటారా? ఇక్కడే ఉంది మతలబ్ అంతా. మన కేసీఆర్‌ నడకకు ఈ సాంగ్‌ని యాడ్ చేసి మరీ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నాయి. కొంతమంది మరో పాటను కూడా యాడ్ చేశారండోయ్.. యమలీల చిత్రంలోని ‘బుడి బుడి అడుగుల తప్పటడుగులే..’ సాంగ్‌ని కూడా జత చేసి మరీ కేసీఆర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

ఇప్పుడు కొత్తేం కాదు..

నిజానికి కేసీఆర్ పెగ్గులు, ఫామ్ హౌస్ అనేవి ఆయనను విమర్శించే వారికి ప్రధాన అస్త్రాలు. కొన్ని సార్లు బై మిస్టేక్ పడిపోవడమనేది కామన్. ప్రతి ఒక్కరి విషయంలోనూ జరుగుతూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో గవర్నర్ తమిళిసై కూడా పాండిచ్చేరిలో ఓ కార్యక్రమానికి హాజరై.. ఏదో తట్టి బొక్క బోర్లా పడిపోయారు. ఆ సమయంలో ఈ కార్యక్రమం కంటే నేను పడిన వీడియోనే మీడియా హైలైట్ చేస్తుందని చెప్పి సరదాగా అనేశారు. నిజంగానే అలాగే జరిగింది కానీ.. దీనిని ఎవరూ ఆ తరువాత హైలైట్ చేయలేదు. ఎలాంటి ట్రోల్స్ రాలేదు. కానీ కేసీఆర్ మాత్రం సమ్ థింగ్ స్పెషల్. చిన్న మిస్టేక్ జరిగిందంటే చాలు.. తెగ ట్రోల్ చేసి నానా రచ్చ చేస్తారు. గతంలో హెలిక్యాప్టర్‌ దిగుతూ తూలిపడిన వీడియో, కొన్ని సభల్లో కేసీఆర్‌ మాట తీరును కూడా నెటిజన్లు, విపక్ష నేతలు బీభత్సంగా ట్రోల్‌ చేశారు.. ఇప్పటికీ చేస్త్ూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కాస్త తూలినట్టుగా కనిపిస్తున్న వీడియో దొరికితే ఊరుకుంటారా? అసలే చాలా రోజుల తర్వాత దొరికింది. నెట్టింట ఒక ఆట ఆడేసుకుంటున్నారు.

కేసీఆర్ మద్యం మానేశారా?

సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో మద్యం మానేశారని కొద్దిరోజుల క్రితం ప్రచారం బీభత్సంగానే జరిగింది. ఆయన తన ఆరోగ్యం దృష్ట్యా వైద్యుల సలహా మేరకు మద్యం మానేయాలని నిర్ణయించినట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్‌ను ఉద్దేశించి తాగుబోతు అంటూ పర్సనల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కేసీఆర్ ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. ‘నువ్వు నాకు మందు పోసినవా.. సోడా కలిపినవా’ అంటూ ఫైర్ అయిపోయారు. ఇది ఇప్పటికీ వైరల్ అవుతోంది. అయితే కేసీఆర్ మద్యం మానలేదని దీనికి ఈ వీడియోనే నిదర్శనమని మహారాష్ట్ర సభ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు మీమ్స్ కూడా బీభత్సంగానే వస్తున్నాయి. ఏ బ్రాండ్ బాపూ అని కొందరు.. ద్దుగాల 90 ఎంఎల్‌ వేస్తే గిట్లనే ఉంటది అని మరికొందరు మామూలుగా లేవ్ మీమ్స్. దీనిపై కేసీఆర్ సైలెంట్‌గా ఉంటారో.. లేదంటే తిరిగి కౌంటర్ ఇస్తారో చూడాలి.