AR.Rahman: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా సినిమాలన్నీ అన్ని భాషలలో ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు మాత్రం హిందీ తమిళం తెలుగు అంటూ భాషా బేధాలు చూపిస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం తాజాగా భాషా బేధం చూపించి నేటిజెన్ల ఆగ్రహానికి గురయ్యారు.
తాజాగా ఈయన తన భార్యతో కలిసి తమిళనాడులో జరిగిన ఓ అవార్డు వేడుకలలో పాల్గొన్నారు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా రెహమాన్ భార్య సైరా భానును మాట్లాడాలని కోరగా ఆమె మాట్లాడుతున్న సమయంలో రెహమాన్ హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడమంటూ తనకు ఆంక్షలు విధించారు. అయితే తనకు తమిళం సరిగా రాదని సైరా బాను ఇంగ్లీష్ లో మాట్లాడారు.
ఇలా తన భార్యకు హిందీలో మాట్లాడొద్దంటూ రెహమాన్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు. కనీసం నీ భార్యకు ఏ భాషలో మాట్లాడాలో స్వేచ్ఛ కూడా ఇవ్వరా? తాను ఎలా మాట్లాడాలో కూడా మీరే నిర్ణయిస్తారా అంటూ భారీగా ఈయనపై మండిపడుతున్నారు.
మరి కొంతమంది ఈ ఘటనపై స్పందిస్తూ మీరు సంగీతం అందించడానికి బాలీవుడ్ సినిమాలు కావాలి. బాలీవుడ్ పాటలు పాడి డబ్బులు సంపాదించవచ్చు కానీ హిందీ భాష మాత్రం మాట్లాడుకూడదా… ఎందుకు హిందీ భాష అంటే అంత ద్వేషం అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎంతోమంది నేటిజన్స్ ఏఆర్ రెహమాన్ వ్యవహార శైలి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…