Movie News

Allari Naresh: 4 రోజులలో 500 ల సిగరెట్లు తాగాను… నటుడు అల్లరి నరేష్ కామెంట్స్ వైరల్!

Allari Naresh: నాంది సినిమా తర్వాత అల్లరి నరేష్ డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో నటించిన చిత్రం ఉగ్రం. ఈ సినిమా మే 5 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా నరేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా ఈయన ఈ సినిమాలో అడవిలో జరిగే ఒక సన్నివేశం గురించి చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సన్నివేశం తీసే సమయంలో అడవిలో స్మోక్ మిషన్లు పెట్టారు. చాలా దట్టంగా పొగ వచ్చేలా ఈ సన్నివేశం ఉంటుంది మరోవైపు నన్ను సిగరెట్ కాలుస్తూ రమ్మని చెప్పారు. ఇలా ఈ అడవి సన్నివేశాలను దాదాపు నాలుగు రోజులపాటు షూటింగ్ చేశారని తెలిపారు.

ఈ నాలుగు రోజులలో తాను దాదాపు 500 సిగరెట్లు కాల్చానని నరేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా రోజుకు 100కు పైగా సిగరెట్లు కాల్చేసరికి నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిందని నరేష్ తెలిపారు.జ్వరం దగ్గుతో పాటు పూర్తి అనారోగ్యం చేసిందని ఈయన ఈ సీన్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాపై ఫ్యాషన్ తో ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఈయన ఈ సన్నివేశాలలో నటించారని తెలుస్తోంది.

Allari Naresh: ఉగ్రరూపం చూపించబోతున్న నరేష్…

ఇక కెరియర్ మొదటి నుంచి కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున నవ్వించిన నరేష్ ప్రస్తుతం మాత్రం తనలో కామెడీ మాత్రమే కాదు మరో యాంగిల్ కూడా ఉంది అంటూ అందరిని భయపెట్టే సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.చాలాకాలం తర్వాత నాంది సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న నరేష్ అనంతరం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాలో కూడా నటించారు.తాజాగా ఉగ్రం సినిమా ద్వారా మరోసారి తన ఉగ్రరూపం చూపించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

7 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

7 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

7 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

9 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

9 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

9 hours ago