NTR: ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం పుష్ప2 . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో విడుదలైన పుష్ప సినిమా అందరి అంచనాలు తారుమారు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ క్రమంలో పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా పుష్ప 2 సెట్ లో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామోజీ ఫిలింసిటీలో పుష్ప2 షూటింగ్ జరుగుతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీ లోనే జరుగుతుంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ బ్రేక్ లో జూనియర్ ఎన్టీఆర్ పుష్ప 2 సెట్ ని విజిట్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు.
ప్రస్తుతం పుష్ప 2 లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఇద్దరు యంగ్ హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంది. సినిమాల పరంగా ఇద్దరి మధ్య పోటి ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇద్దరు మంచి స్నేహితులు.
ఇక ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ చెప్పిన విషెస్ ఆసక్తిగా ఉన్నాయి.
అల్లు అర్జున్ పుట్టిన రోజు ఎన్టీఆర్ విషెస్ చెబుతూ.. పార్టీ లేదా పుష్ప అని ఫన్నీగా కామెంట్ చేయడంతో వారి మధ్య ఉన్న బాండింగ్ కి ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు కూడా ఇదే చనువుతో పుష్ప 2 సెట్ ని ఎన్టీఆర్ విజిట్ చేశాడు. దీంతో అటు బన్నీ అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వీరిద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…