Star Actress: సాధారణం సినిమా సెలెబ్రిటీలు అంటే ప్రేక్షకులకు అమితమైన అభిమానం ఉంటుంది. అయితే వివిధ రకాలుగా వారి అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా యువత తమ అభిమాన హీరోయిన్స్ కి ఏకంగా గుడి కట్టించి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ కి ఇలా గుడి కట్టించారు. తాజాగా సమంత అభిమాని ఒకరు తన ఇంట్లోనే ఆమెకు గుడి కట్టించి ఆమె మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంత మీద ఉన్న అభిమానంతో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు ఇంట్లోనే ఏర్పాటు చేసి గుడి కట్టించాడు. అయితే సమంత ఇలాగే మరికొందరు హీరోయిన్స్ కి కూడా అభిమానులు గుడి కట్టించారు . ఆ హీరోయిన్స్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• ఖుష్బూ : భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అందాల నటి కుష్బూకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె మీద ఉన్న అభిమానంతో కొందరు తమిళనాడు తిరుచిరాపల్లిలో ఖుష్బూకు గుడి కట్టించి వారి అభిమానాన్ని చాటుకున్నారు.
• హన్సిక : దేశముదురు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన హన్సిక తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈక్రమంలో కొందరు ఫ్యాన్స్ చెన్నై శివారులో హన్సిక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మించారు.
• నగ్మా : టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందిన అలనాటి అందాల నటి నగ్మా కి యువతలో మంచి ఫాలోయింగ్ ఉండేది. దీంతో ఆమె అభిమానులు తమిళనాడులో పలు చోట్ల గుడులు కట్టించారు. అయితే కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయి.
• నమిత : తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నమిత కి తమిళనాట బోలెడు అభిమానులున్నారు. అందుకే కోయంబత్తూర్, తిరనవెల్లితో పాటు మరో మూడు చోట్ల నమితకు గుడి కట్టారు ఫ్యాన్స్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…