Balakrishna -Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి మద్య అనుబంధం గురించి రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారు మాత్రం తమ మద్య ఏలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. సినిమాల పరంగా వీరిమధ్య గట్టి పోటీ ఉన్న సంగతి వాస్తవమే. వీరిద్దరూ నటించిన ఎన్నో సినిమాలు థియేటర్లలో పోటీపడ్డాయి. కొన్ని సందర్భాలలో ఎవరో ఒకరు హిట్టు కొడితే మరి కొన్ని సందర్భాలలో ఇద్దరు నటించిన సినిమాలు కూడా హిట్ అందుకునేవి.
తాజాగా సంక్రాంతి కానుకగా మరొకసారి వీరిద్దరూ కూడా థియేటర్లలో పోటీపడ్డారు. వీరసింహారెడ్డి సినిమా ద్వారా బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాగా.. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే వీరిద్దరూ నటించిన సినిమాలు కూడా మంచి హిట్ అందుకున్నాయి. అయితే వీరిద్దరిని కలిసి ఒకే స్క్రీన్ మీద చూడాలని ఇరువురి అభిమానులు ఆశపడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో బాలయ్య బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా వీరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. చిరు, బాలయ్యల మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలిపే ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణ కోసం చిరు తన గెస్ట్ హౌస్ ని వాడుకోమని ఇచ్చాడు.
నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమా షూటింగ్ కోసం చెన్నైలోని వెల్లిచ్చెరి ప్రాంతంలో ఉన్న హనీ హౌజ్ అనే గెస్ట్ హౌస్ ని వాడుకోమని చిరు తన గెస్ట్ హౌస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 90 శాతం ఈ గెస్ట్ హౌస్ లో బాలయ్య సినిమా షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 25 1990లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిన సినిమా ఇది. ఎందుకంటే ఇది బాలకృష్ణ 50వ సినిమా. ఇలా చిరు, బాలయ్య మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపే ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…