విద్యార్థి ఇంట్లో వెలుగులు నింపిన ఉపాధ్యాయులు.. ఏం చేశారంటే!

విద్యార్థి ఇంట్లో వెలుగులు నింపిన ఉపాధ్యాయులు.. ఏం చేశారంటే!
సాధారణంగా ఒక విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన బాధ్యత గురువు ఉంటుంది. ఈ క్రమంలోనే గురువులు విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకు వచ్చి వారిని జీవితంలో మంచి ఉన్నత స్థాయిలో నిలబెడతారు. అయితే కేరళలో మాత్రం ఉపాధ్యాయులు కేవలం విద్యార్థి జీవితంలో వెలుగులు నింపడమే కాకుండా వారి ఇంట్లో కూడా వెలుగులు నింపి అందరి చేత ప్రశంసలు పొందారు. ఈ విధంగా ఉపాధ్యాయులు చేసిన పనికి స్థానికులు ఉపాధ్యాయుల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలు సైతం విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ తరగతులు వినాలంటే తప్పకుండా ఇంట్లో కరెంట్ సౌకర్యం ఉండాలి. ఈ క్రమంలోనే కేరళలోని వడకర సమీపంలో ఉన్న కీజల్ యూపీ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారా లేదా అని గ్రామంలో పర్యటించారు.

ఈ క్రమంలోనే ఓ విద్యార్థి ఇంట్లో విద్యుత్ సదుపాయం లేక ఆన్లైన్ తరగతులను తినలేకపోతున్నానని గుర్తించిన ఉపాధ్యాయుడు శ్రీజన్ ఆ విద్యార్థి ఇంటికి విద్యుత్ వైరింగ్ చేసి వెలుగులు నింపాడు.ప్రస్తుతం విద్యార్థి ఇల్లు నిర్మాణ దశలో ఉండటంతో వైరింగ్ చేయడానికి మరికొంత ఆలస్యం అవుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు తెలపడంతో ఉపాధ్యాయుడు శ్రీజన్ వైరింగ్ కోర్సు పూర్తి చేయడంతో ఇతర ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థి ఇంటిలో వైరింగ్ పూర్తిచేసి విద్యుత్ సదుపాయం కల్పించారు.

ఈవిధంగా ఉపాధ్యాయుల సహకారంతో తన ఇంటిలో వెలుగు చూసిన విద్యార్థి మోములో చిరునవ్వు కనిపించిందని ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శ్రీజన్ తెలిపాడు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థికి ఆన్లైన్ తరగతులను వినడానికి DYFI కమిటీ ఒక మొబైల్ ఫోన్ కూడా అందించారు. ఈ విధంగా ఉపాధ్యాయుడు చేసిన పనికి విద్యార్థి తల్లిదండ్రులు స్థానికులు ఆ ఉపాధ్యాయుడు పై ప్రశంసలు కురిపించారు.