తెలుగు బుల్లితెరపై గత రెండు దశాబ్దాల కాలం నుంచి తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ విజయపథంలో దూసుకుపోతున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లి తెర పై ఏ ఛానల్ పెట్టినా అందులో మనకు సుమ దర్శనమిస్తారు. స్పష్టమైన మాటతీరు, తనదైన శైలిలో పంచులు వేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒకవైపు బుల్లితెర పై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ సోషల్ మీడియాలో కూడా అభిమానులకు దగ్గరగా ఉంటూ అభిమానుల సందడి చేస్తున్నారు.
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాలలో క్యాష్ ఒకటి. తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈవారం క్యాష్ ప్రోగ్రాంకు పవన్ – అంజలి, విశ్వ -ప్రశాంతి, కరుణ -వాసుదేవ్, శిరీష -సన్నీ జంటగా వచ్చారు. ఈ విధంగా అందరితో కలిసి సుమ చేసిన రచ్చ మామూలుగా లేదు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వీరితో సుమ తనదైన శైలిలో పంచులు వేస్తూ రచ్చ చేశారు. వీరు కూడా సుమకు దీటుగా సమాధానాలు చెబుతూ ఎంతో సరదాగా పంచులు వేస్తూ ఆడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ షోలో భాగంగా సన్నీ మాట్లాడుతూ స్వామి రారా సినిమా తరువాత వెస్మా తీసుకున్నానని చెప్పడంతో వెంటనే సుమ మరి టైటానిక్ సినిమా చూసి ఏం తీసుకున్నావ్ అంటూ ప్రశ్నించింది.ఈక్రమంలోనే వాసుదేవ్ కల్పించుకొని టైటానిక్ సినిమా తీసిన తర్వాత ఆ సినిమాలోని ఫోజ్ ట్యాంక్ బండ్ పై ట్రై చేశాడు. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. వాసుదేవ ఇలా మాట్లాడగా సన్నీ కల్పించుకొని మీరు మాట్లాడేది ఏ ఫోజ్ గురించి అని అడగడంతో బొమ్మ గీసాడు కదా అది కాదు కదా అని అంటాడు. అప్పుడు సుమ కలుగజేసుకుని..”కాదు జాక్.. రోజ్ బొమ్మ గీశాడు కానీ, రోజ్.. జాక్ బొమ్మను గీసి ఉంటే ఏమయ్యేదో “అంటూ ఆ ఫోటో గురించి కామెంట్స్ చేస్తూ విపరీతంగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…