KK Survey:  వైసిపి ఓటమికి అదే ప్రధాన కారణం.. ఒక్క మాటలో చెప్పిన కేకే సర్వే!

KK Survey: కేకే సర్వే రాష్ట్ర రాజకీయాలలో మాత్రమే కాదు దేశ రాజకీయాలలోనే  సంచలన సర్వే సంస్థగా నిలిచిపోయింది. కిరణ్ కొండేటి ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సర్వే నిర్వహించి ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయంపై స్పష్టత ఇచ్చారు. 2019 ఎన్నికలలో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి రాబోతుందని తెలిపిన కేకే సర్వే 2024వ సంవత్సరంలో కూటమి 160 సీట్ల మెజారిటీ అందుకోబోతుందని వెల్లడించారు.

ఇలా కేకే సర్వే ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పడంతో ఎంతోమంది విమర్శలు కూడా చేశారు. కేకే అంటే కమ్మ కాపు సర్వే అని విమర్శల వర్షం కురిపించారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పిన దానికంటే కూడా కూటమికి అదనంగా మరో నాలుగు సీట్లు రావడంతో ఒక్కసారిగా కేకే సర్వే సంచలనంగా మారింది.

ఇలా కేకే సర్వే చెప్పిన విధంగానే ఫలితాలు రావడంతో కూటమి నేతలు ఈయనకి ఇటీవల సన్మానం కూడా చేశారు. ఈ సన్మాన సభలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా కుప్పకూలి పోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఒక్క మాటలో చెప్పేశారు.

సంక్షేమానికి పరిమితం కావటం..
గతంలో 151 సీట్లతో అధికారాన్ని అందుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలా 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడానికి ప్రధాన కారణం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకోవడం అని తెలిపారు. ఇలా సంక్షేమానికి దగ్గరైన ఈయన ప్రజాదరణ కోల్పోయారని దీంతో రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉద్యోగ భద్రత కల్పించలేకపోయారని అదే ఆయన ఓటమికి కారణమంటూ కిరణ్ కొండేటి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.