Kota Srinivarao: నేను బ్రతికే ఉన్నాను… తన మరణ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన కోటా శ్రీనివాసరావు!

Kota Srinivarao: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా కారణంగా ప్రపంచం నలుమూలలో జరిగిన విషయాలు అన్ని నిమిషాలలోనే అందరికీ తెలిసిపోతున్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఉపయోగపడే విషయాలు షేర్ చేయటమే కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి అనేక దుష్ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు.

తాజాగా సోషల్ మీడియా వల్ల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన కోటా శ్రీనివాసరావు ఎన్నో మంచి మంచి పాత్రలలో నటించాడు. అలాగే విలన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా కోటా శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ క్రమంలో తాజాగా కోటా శ్రీనివాసరావు మరణించాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ వార్త తెలియగానే ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. దీంతో అనేకమంది సెలబ్రిటీలు ఆయన ఇంటికి ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన తన మరణ వార్త గురించి తెలుసుకున్న కోటా శ్రీనివాసరావు స్పందిస్తూ..” తన మరణం గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని వాటిని ఎవరు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Kota Srinivarao: తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించకండి…


ఉదయం 7, 7:30 గంటల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.నేనే ఒక 50 కాల్స్ వరకు మాట్లాడాను.. ఇది నిజమే అనుకుని ఓ పది మంది పోలీసులు కూడా సెక్యూరిటీ కోసం వచ్చారు. ఇలాంటి అవాస్తవాలను మీరే అరికట్టాలని పోలీసులకు చెప్పాను. జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి.. మనిషి ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేయకండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇండస్ట్రీలో ప్రశాంతత నెలకొంది.