నా కూతురుని లారీ గుద్ది కాలు తీసేశారు. కొడుకు అలా చనిపోయాడు. ఫ్యామిలీని తలుచుకుంటూ కంటతడి పెట్టిన కోట!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల కాలం పాటు విలక్షణ నటుడిగా, కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వయసు పైబడటంతో సినిమా అవకాశాలు తగ్గడంతో పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూల ద్వారా ఆసక్తికరమైన విషయాల తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

కోట శ్రీనివాసరావు పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలకు తన అత్తగారు మరణించడంతో ఆ విషయం తెలుసుకున్న తన భార్య ఒక సైకియాట్రిక్ వ్యాధితో బాధ పడిందని, ఆ సమయంలో తను ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితుల్లో తన ఉండేదని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా సినిమాల పరంగా తనకు ఎంతో మంచి పేరును తీసుకువచ్చిన ఆ భగవంతుడు తనకు కష్టాలను కూడా అదే స్థాయిలో తీసుకువచ్చారని తెలిపారు.

ఈ క్రమంలోనే తన భార్య వింత వ్యాధితో బాధపడటం గురించి తెలియజేసిన కోట శ్రీనివాసరావు తన కూతురు కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన కూతురు విజయవాడలో తన అక్కయ్య పిల్లలు అన్నయ్య పిల్లలతో కలిసి సరదాగా రిక్షాలో బయలుదేరి వెళ్తున్న సమయంలో ఎదురుగా ఒక లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో డివైడర్ దాటుకుని వీరు ప్రయాణిస్తున్న రిక్షాను ఢీకొట్టిందని, ఆ ప్రమాదంలో ఇద్దరు ముగ్గురు మరణించారు. దీని అదృష్టం బాగుండి కాలు విరిగిందని తెలిపారు.

ఇలా కాలు విరిగిన తన కూతుర్ని చూస్తూ రోజు బాధపడే వాడిని. అయితే నేను మొదట ఏ బ్యాంకులో అయితే గుమస్తాగా పని చేశానో ఆ బ్యాంక్ మేనేజర్ చివరికి నాకు వియ్యంకుడిగా మారారు. తన కొడుకు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు తనకు ఒక కూతురు తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఇకపోతే కోట శ్రీనివాస్ రావు కొడుకు గురించి మనకు తెలిసిందే. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కోట శ్రీనివాస్ రావు కొడుకు బండి పై ప్రయాణం చేస్తుండగా యాక్సిడెంట్ కి గురై మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాలన్నింటిని తలచుకుని కోట శ్రీనివాస్ రావు ఎమోషనల్ అయ్యారు. అయితే ఎన్ని బాధలు ఉన్న ఎప్పుడు కూడా తన బాధను బయట పంచుకోలేదని, వారు గుర్తొచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తాను తప్ప నా బాధను బయటకు చెప్పుకోనని తెలియజేశారు. ఇక మరో జన్మంటూ ఉంటే నటుడిగా జన్మించాలని కోరుకుంటారా అనే ప్రశ్న ఎదురు కాగా తనకు ఇలాంటి జీవితమే కావాలని.. అయితే ఈ కష్టాలను తగ్గించి పది మందికి సేవ చేసే గుణం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ అంటూ ఈ సందర్భంగా కోట శ్రీనివాస్ రావు తెలియజేశారు.