నందమూరి బాలయ్య అభిమానులు కొన్ని రోజుల నుంచి మంచి జోష్ లో ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే.. అతడు ఆహాలో త్వరలో ప్రసారం కానున్న అన్‌స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరించునున్నారు. బాలయ్య ఈ అన్‌స్టాపబుల్ షోలో ఎలా యాంకరింగ్ చేయనున్నారో చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అల్లుఅరవింద్ ఆ హీరోను ఒప్పించడంలో సఫలం అయ్యారు. ఈ షో నవంబర్ 4 నుంచి ఆహాలో టెలికాస్ట్ కానుంది.
ఈ షో లాంచ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ.. పొట్టివాళ్లు గట్టివాళ్లు అంటూ అల్లు అరవింద్ ను ఆట పట్టించారు. తన తండ్రితో ఇండస్ట్రీలో ఎవరికీ లేని చనువు కేవలం అల్లు రామలింగయ్యకు మాత్రమే ఉండేదని.. ఎన్టీఆర్ ను బండోడు అనే వాడని గుర్తు చేసుకున్నారు.
ఇలా అతడి సంభాషణ అంతా సందడి సందడిగా సాగిపోయింది. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ ఈ షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనేది అభిమానులు తెలుసుకోవాలని ఉత్సుకతను చూపిస్తున్నారు. అయితే ఈ షోకు అతడు భారీగా పారితోషికమే అందుకోనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాలయ్యతో యాంకరింగ్ అంటే మామూలు విషయం కాదు.. దానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. అల్లు అరవింద్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అతడు ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు రూ.40 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిలో మొత్తం 12 ఎపిసోడ్లు ఉంటాయి. మొత్తం లెక్కేస్తే.. దాదాపు రూ.6 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు బాలయ్య.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…