Kranthi Balivada : కుర్చీలో కూర్చొని భోజనం చేస్తుంటే ఎమ్మెస్ నారాయణ నన్ను తిట్టారు… ప్రకాష్ రాజ్ అంటే చాలా భయం… : డబ్బింగ్ ఆర్టిస్ట్ క్రాంతి బలివాడ

Kranthi Balivada : సీరియల్ నటిగా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన క్రాంతి బలివాడ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. అరుంధతి, కేజీఎఫ్ లాంటి హిట్ సినిమాల్లో కూడా తన గాత్రం తో మెప్పించారు. తాజాగా ఇంటర్వ్యూల్లో పాల్గొన్న క్రాంతి షూటింగులో తన అనుభవాలను, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కష్టాలను తెలిపారు. క్రాంతి అనగానే గుర్తొచ్చేది మనసు మమతా సీరియల్ సింధు. ఆ సీరియల్ తో బాగా ఫేమస్ అయిన క్రాంతి నెగెటివ్ పాత్రలను కూడా సీరియల్స్ లో చేసారు.

ఎమ్ ఎస్ నారాయణ అందుకు తిట్టారు….

షూటింగుల్లో తన అనుభవాలను చెబుతూ ఒక సారి సినిమా షూటింగ్ లో ఎమ్ ఎస్ నారాయణ గారితో ఉన్నపుడు షూటింగ్ విసుగుపుట్టి చిరాకు పడితే ఎమ్ ఎస్ గారు మందలించారట. నీకేంటి సమస్య తిండి పెట్టారు, మంచి మేకప్ వేశారు, హెయిర్ డ్రెస్సింగ్ చేసారు కదా బయట ఎంతోమంది అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు. అలాంటిది నీకు అవకాశం వచ్చి సినిమాలో వేషం దొరికితే సెట్స్ లో కూర్చోడానికి విసుక్కుంటున్నావా అని మందలించారట. ఇక అలా అనే సరికి సీనియర్స్ ముందు నోరు జారకూడదని నిర్ణయించుకున్నారట క్రాంతి.

ఇక ప్రకాష్ రాజ్ అంటే అందుకే భయం….

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ గారి గురించి తన అనుభవాలను పంచుకున్నారు క్రాంతి. ప్రకాష్ రాజ్ గారు సెట్స్ లో అందరితో మాట్లాడుతూనే తన స్క్రిప్ట్ ఒకసారి చూసుకొని ఇచ్చేస్తారు. షూటింగులో టేక్‌ తీసుకోకుండా చెప్పేస్తారు. ఆయన మెమరీ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఆలాంటి వ్యక్తితో నటించినపుడు తడబడుతానని భయంగా ఉంటుందని వివరించారు. అరుంధతి సినిమా లో డబ్బింగ్ చెప్పాక ఇక ఏ హార్రర్ సినిమాలో అయినా డబ్బింగ్ చెప్పగలను అనే నమ్మకం వచ్చిందని చెప్పారు. కేజీఎఫ్ లో రిపోర్ట్ కి డబ్బింగ్ చెప్పినప్పుడు అసలు ఈ సినిమా ఏ జోనర్ అనే సందేహం వచ్చిందని సినిమా యూనిట్ ను అడిగానని కానీ తెరపై సినిమా చూస్తున్నపుడు ఆశ్చర్య పోయానని చెప్పారు. క్రాంతి ఎక్కడికి పోయావు చిన్నవాడా సినిమాలో హీరోయిన్ కి కూడా డబ్బింగ్ చెప్పింది.