చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన లక్ష్మీపార్వతి.. ఆస్కార్ అవార్డును మించిన నటనంటూ కామెంట్స్..!

ఇటీవలే తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు ఆయన భార్యను కూడా వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా విమర్శించిన విషయం అందరికి తెలిసిందే. దీనితో చంద్రబాబు ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయం పై పలువురు టీడీపీ నేతలు, నందమూరి ఫ్యామిలీతో పాటు, పలువురు ప్రముఖులు కూడా ఈ విషయం పట్ల వైసీపీ తీరును ఖండిస్తున్నారు. తనను మాత్రమే కాకుండా, తన కుటుంబం పైనా వ్యక్తిగత విమర్శలు చేస్తూ అవమానించారంటూ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరైన విషయం తెలిసిందే.

దీనితో చంద్రబాబు కన్నీరు చూసి టిడిపి నేతలు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీనితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగారు. గుంటూరు, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో టిడిపి నేతలు ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలకు గురయ్యాయి.రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉందని, ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సైతం వైసిపి నేతలను దారుణంగా బూతులు మాట్లాడుతున్నారు.ఇదిలా ఉంటే వైసీపీ నాయ‌కుల‌తో పాటు ప‌లువురు చంద్ర‌బాబు తీరుని ఖండిస్తున్నారు.

శాసనసభలో తొలుత టీడీపీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి తల్లి,చెల్లి, బాబాయ్‌,గొడ్డలి అంటూ కేకలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వారిని వారించాల్సింది పోయి చూస్తూ ఉండిపోయారన్నారు. చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీలో ఎవరూ పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. ఆధారాలు ఉంటే చూపాలని సవాల్‌ చేశారు. భువనేశ్వరిని ఒక్కమాట కూడా అనలేదన్నారు.తాజాగా ఈ విషయం పై ల‌క్ష్మీ పార్వ‌తి స్పందించారు. సీనియర్ ఎన్టీఆర్ విషయంలో చేసినట్లుగానే అసెంబ్లీ అంశంలోనూ చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆమె తెలిపారు.అక్కడ ఏమి జరగకపోయినప్పటికీ మసిపూసి మారేడుకాయ చేశారని చంద్రబాబుపై లక్ష్మీపార్వతి విమర్శనాస్త్రాలు గుప్పించింది.

అయితే తాను ఒక వైసీపీ నాయకురాలిగా మీడియా ముందుకు రాలేదని ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా మాత్రమే వచ్చానని తెలిపారు. నందమూరి ఫ్యామిలీ చంద్రబాబు మాయలో పడొద్దని కోరుతున్నా ఆ ఫ్యామిలీలో బాలయ్య బాబు మంచివాడని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పని ఓ నిజం చెబుతున్నా ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు తనకు ఫోన్ చేసి ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని అన్నారు. ఇది నిజమో కాదో బాలయ్య చంద్రబాబును అడగాలని లక్ష్మీపార్వతి తెలిపారు.చంద్రబాబు కన్నీళ్ళని నాటకాలనే ఇతను ఆస్కార్ అవార్డును దాటిపోయి నటిస్తున్నారంటూ ఈమె విమర్శలు చేశారు.