సాధారణంగా అభిమానులు తన అభిమాన హీరో హీరోయిన్ లతో ఫోటోలు దిగాలి, ఆటోగ్రాఫ్ ఇప్పించుకోవాలి అని తెగ ఆరాట పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు తమ అభిమాన సెలబ్రిటీలు స్టేజీల పై మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా షాపింగ్ మాల్స్ లాంటివి ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. అలాంటిది అదే సెలబ్రిటీలు రోడ్డుపై కనిపిస్తే ఇక ఆ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.
ఈ క్రమంలోనే అభిమానులు సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో హీరోలు వారి సెల్ఫోన్లు తీసుకుని వారిని ఆటపట్టిస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ హీరోకూడా ఇదే విధంగా చేసారు.బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన స్నేహితుడితో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు అభిమానులు బైక్‌పై కూర్చొని సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తున్నారు.
అంతలోనే జాన్ అబ్రహం వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ల చేతుల్లోంచి ఫోన్ లాక్కున్నాడు. అనంతరం కెమెరా వైపు చూస్తూ హాయ్ గాయ్స్ ఇప్పుడు ఓకేనా అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆ ఇద్దరు అభిమానులు జాన్ ని అనుసరించి ఫోన్ తీసుకున్నారు. ఈ సరదా సన్నివేశం వీడియోని జాన్ అబ్రహం ఇన్ స్టాలో షేర్ చేసారు. ఈ వీడియో పెట్టడం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
స్టార్ అయినప్పటికీ ఏ మాత్రం గర్వం అనేది చూపించకుండా ఓ ప్రెండ్ లా మూవ్ అవ్వడం చూసి అతనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక జాన్ అబ్రహాం సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సత్యమేవ జయతే-2 లో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 25న రిలీజ్ కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…