Laywer Nageswararao : నిహారిక చేసిన తప్పు అదే… ఆమెకు పడే శిక్ష ఏంటంటే…: లాయర్ నాగేశ్వరావు

Laywer Nageswararao : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారిక రెడ్డి తో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ హత్య చేసి తల, మొండేం వేరు చేసి గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వాట్సాప్ లో ఫోటో తీసి పంపాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది. నిహారిక రెడ్డికి అలాగే హరిహర ఇద్దరికీ శిక్ష పడాలి అంటూ నవీన్ కుటుంబం కోరుకుంటోంది. ఇక నిహారికను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అసలు నిహారికకు శిక్ష పడుతుందా లేదా, న్యాయపరంగా ఉన్న విషయాలను హై కోర్ట్ అడ్వకేట్ నాగేశ్వరావు గారు తెలిపారు.

నిహారిక హత్య చేయలేదు… కానీ నిందితురాలే…

నవీన్ హత్య కేసులో మొదటి నుండి నిహారిక రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆమె వల్లే హరిహర కృష్ణ, నవీన్ ను చంపాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే నిహారిక రెడ్డి ఇంతవరకు పోలీసులకు ఎక్కడా నిజాలు చెప్పకపోయినా చివరికి పోలీసుల వలలో చిక్కింది. ఆమె హత్య చేయకపోయినా చేసిన హరిహర కు డబ్బులు ఇవ్వడం, హత్య చేసాడని తెలిసినా పోలీసులకు చెప్పక పోవడం వంటివి చేయడం వల్ల ఆమె కూడా శిక్షార్హురాలే అంటూ నాగేశ్వరావు గారు తెలిపారు.

హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి రావడం, విషయాన్ని పోలీసులకు చెప్పకపోవడం వంటివి నేరాలుగా పరిగనిస్తూ ఆమెకు దాదాపు ఏడు సంవత్సరాలు పైనే శిక్ష పడుతుందని వివరించారు. నిహారిక రెడ్డి హరిహర హత్య చేసానని చెప్పిన వెంటనే పోలీసులకు చెప్పి ఉంటే విట్నెస్ అయి ఉండేది. అలా చేయకుండా హరిహర పారిపోడానికి సహకరించడం వల్ల నిందితురాలయింది అంటూ వివరించారు.