భారత్​ ఖాతలో మరో పతకం.. కాంస్యం సాధించిన లవ్లీనా..!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకాన్ని సాధించింది. భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్‌ బాక్సింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. భారత బాక్సింగ్‌కు 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందించింది. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్‌ ఒలింపిక్‌ కాంస్యా పతకాలను గెలుచుకున్నారు. ఇక 69 కేజీల విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. గతంలో లవ్లీనా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు అందుకంది.

టోక్యో ఒలింపిక్స్​లో పతకాన్ని గెలిచిన బాక్సర్​ లవ్లీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆమె పోరాటం చాలా మందికి స్ఫూర్తిధాయకంగా నిలిచిందని అభివర్ణించారు. ఆమె భవిషత్తులోనూ మరిన్ని పతకాలు సాధించాలని మోదీ అక్షాక్షించారు.