కేంద్రం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ దేశంలో గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ను ప్రైవేట్ పరం చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం బీపీసీఎల్ ను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో చాలామంది గ్యాస్ వినియోగదారులు ఇకపై కేంద్రం ఇచ్చే సబ్సిడీని పొందలేదమని భావించారు.

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా బీపీసీఎం వాటాలను విక్రయిస్తోంది. దీంతో చాలామంది వినియోగదారులు ఇకపై వంట గ్యాస్ సబ్సిడీని పొందలేమని భావిస్తున్న తరుణంలో కేంద్రం స్పందించి స్పష్టతనిచ్చింది. చమురు మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీపీసీఎల్ కస్టమర్లకు గ్యాస్ సబ్సిడీ విషయంలో ఆందోళన చెందవద్దని కీలక సూచనలు చేశారు.

బీపీసీఎం ప్రైవేట్ పరం అయినా వంటగ్యాస్ పై సబ్సిడీ యథాతథంగా కొనసాగుతుందని ప్రజలు అనవసర భయాందోళనకు గురి కావద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కంపెనీలతో సంబంధం లేకుండా వంట గ్యాస్ సబ్సిడీని నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తుందని అందువల్ల మధ్యలో ఎటువంటి కంపెనీలు లేవు కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

చమురు రంగ సంస్థలు ప్రభుత్వ కంపెనీలు అయినా ప్రైవేట్ కంపెనీలు అయినా ఎల్పీజీ సబ్సిడీ యథాతథంగా కొనసాగుతుందని అందువల్ల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది. కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు సంవత్సరానికి 12 సిలిండర్లను సబ్సిడీ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం.