Featured

పాక్ సంచలన నిర్ణయం.. రేప్ చేస్తే మగతనం మటాష్..!

ప్రపంచ దేశాల్లో రోజురోజుకు అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నా అత్యాచార ఘటనలు, వేధింపుల కేసులు తగ్గడం లేదు. ఇలాంటి కేసులను తగ్గించడం కోసం పలు దేశాల ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. ఆ చట్టాల ద్వారా అలాంటి ఆలోచనలు వచ్చినా ప్రజలు భయపడేలా చేస్తున్నాయి.

తాజాగా పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో రెండు కొత్త ఆర్డినెన్స్ లను అమలులోకి తెచ్చింది. ఫలితంగా దేశంలో రేప్ కేసులు, లైంగిక వేధింపుల కేసులను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది. కెమికల్‌ కాస్ట్రేషన్‌ ద్వారా రేపిస్టులకు పుంసత్వాన్ని దెబ్బతీయాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. రేప్ కేసులకు సంబంధించి విచారణ కొరకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి పాక్ ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ కొత్త ఆర్డినెన్స్ లకు కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అన్ని వయస్సుల స్త్రీలను మహిళలుగా ఈ కొత్త చట్టంలో భావిస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో అమలవుతున్న నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలలోపు బాలికలపై అత్యాచారం చేస్తే మాత్రమే రేప్ కేసుగా నమోదు చేసుకుంటున్నారు. పుంసత్వాన్ని దెబ్బతీయడం దోషులు చేసిన రేప్ కేసుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశంలో యాంటీ రేప్‌ సెల్స్‌ ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. గతంలో పాకిస్తాన్ లో టూ ఫింగర్‌ టెస్ట్ ద్వారా కన్యత్వాన్ని నిర్ధారించేవారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ పరీక్షలపై సైతం పాక్ ప్రభుత్వం నిషేధం విధించడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago