Lunar Eclipse effects : కార్తీక పౌర్ణమి, చంద్ర గ్రహణం ఈ నాలుగు రాశుల వారికి వచ్చే నెలల్లో ఖచ్చితంగా తల రాత మారి అదృష్టం పట్టబోతోంది..!

Lunar Eclipse effects : కార్తీక మాసం మొదలయింది. శుభకృత నామ సంవత్సరం కార్తీక మాసం శుక్ల పక్ష పౌర్ణమి మంగళవారం నాడు చంద్ర గ్రహణం భరణి నక్షత్రం రోజున రాహు గ్రస్థమైన చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ చంద్ర గ్రహణం ద్వాదశ రాశుల్లో కొన్నింటికి మంచి ఫలితాలను ఇస్తుంటే మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. అసలు ఏ రాశి వారికి వచ్చే ఆరు నెలలు ఎలా ఉండనుందంటే…

ఆ నాలుగు రాశులకు చంద్ర గ్రహణం తరువాత మంచి ఫలితాలు…

చంద్ర గ్రహణం భరణి నక్షత్రం లో ఏర్పడుతుంది కాబట్టి భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు అలాగే అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు, కృత్తిక నక్షత్రం మొదటి రెండు పాదాల వారు ఈ చంద్రగ్రహణం చూడకుండా ఉండటం మంచిది. ద్వాదశ రాశులలో కుంభ రాశి వారికి, వృశ్చిక, కర్కాటకం, మిథున రాశి వారికి చంద్ర గ్రహణం తరువాత ఆరు నెలలు మంచి శుభఫలితాన్ని ఇవ్వనుంది. ఇక తులా రాశి, ధనుస్సు, మీనం, సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. అంటే చెప్పుకోదగ్గ ఇబ్బందికర పరిస్థితులు కలుగవు. ఇక మిగిలిన నాలుగు రాశులు మేష రాశి, వృషభం, కన్య, మకర రాశి జాతకులకు ఈ చంద్ర గ్రహణం అశుభ ఫలితాలను ఇవ్వనుంది. మేష రాశి భరణి నక్షత్రం లో చంద్ర గ్రహణం ఏర్పడటం వల్ల ఈ మేష రాశి వారు, అలాగే వృషభ రాశి వారికి చంద్రుడు ఉచ్చ స్థితి లో ఉండటం అలాగే కన్య, మకర రాశులు కూడా ఈ గ్రహణన్ని చూడకూడదు.

అశుభ గ్రహాలకు గ్రహణ సంబంధ శాంతులు…

గ్రహణం వల్ల వచ్చే రోజుల్లో అశుభ ఫలితాలను పొందే రాశులు అలా జరగకుండా కొంతలో కొంత ఉపశమనం పొందేందుకు గ్రహణ సంభంధ శాంతులను చేయాలి. అనగా పెద్ద యజ్ఞాలు యాగాలు చేయాల్సిన పని లేదు. కేవలం కొన్ని పరిహారలను చేయడం ద్వారా గ్రహణ దోషాన్ని నివారించుకోవచ్చు. మేష, వృషభ, కన్య, మకర రాశుల వారు చంద్రుడికి ఎంతో ప్రీతికరమైన ధాన్యం బియ్యం, అలాగే రాహు కి సంబంధించిన ధాన్యం మినుములను ఒక తెల్లటి వస్త్రం లో అలాగే మినుములు నీలం వస్త్రంలో కానీ లేక తెల్లటి వస్త్రం లో కానీ ఒకటింపావు కేజీ చొప్పున పోసి ఎవరికైనా దానము ఇచ్చినా పరిహారం అవుతుంది.

లేదంటే గోమాతకు ఆ రెండింటినీ కలిపి ఆహారంగా చేసి తినిపించినా పరిహారం అవుతుంది. ఇక జాతకం లో చంద్రుడి స్థానం సరిగా లేకపోయినా గ్రహణం కాబట్టి సోమనాథ స్వామి గా వెలసిన శివుని గుడికి వెళ్లి పూజ చేసినా అలాగే సోమనాథ స్తోత్రం చదివినా మంచి ఫలితం ఉంటుంది. ఇక సోమనాథ ఆలయం సమీపంలో లేని వారు నవగ్రహాలు ఉన్న శివాలయం పురాతనమైన గుడి ఉన్నట్లయితే అక్కడ రుద్రాభిషేకం చేయించుకోవడం ఉత్తమం. ఇక వృత్తి, ఉద్యోగ సమస్యల్లో ఉన్నవారు స్పటిక శివలింగాన్ని తీసుకుని ఓం నమః శివాయ అనుకున్నా లేక నమక చమకాలు వచ్చినవారు వాటిని పఠిస్తూ పూజ చేసినా శుభ ఫలితాలను పొందుతారు.