బరువు తగ్గాలనుకునే వారు.. ఈ గింజలను తరచూ తీసుకోండి..

మనిషి ఆరోగ్యంగా.. అందంగా ఉంటే.. దానికి మించింది మరొకటి ఉండదు. అలాంటిది రావాలంటే మఖనా (తామర గింజలు) ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇచ్చే కాల్షియం దీనిలో పుష్కలంగా ఉంటుంది.

పొటాషియం, భాస్వరం, మెగ్నీషియంతో పాటు కొన్ని విటమిన్లు ఇందులో ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారు మఖానా తీసుకుంటే కొన్ని రోజుల్లోనే తగ్గిపోతారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున వీటిలో గొప్ప యాంటీ ఏజింగ్ ప్రభావం ఉంటుంది.

ఇది ముఖ్యంగా యవ్వనంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని తరచుగా తీసుకోవడం ద్వారా బరువు గ్గడంతో పాటు అందంగా కూడా కనపడుతుంటారు. వైద్య నిపుణులు కూడా మఖానా తినడం వల్ల బరువు తగ్గొచ్చని సలహా ఇస్తున్నారు. దీనిలో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల లావు తగ్గడానికి సలభంగా ఉపయోగపడుతుంది.

తక్కువ గ్లైసెమిక్ ఉండటం వల్ల ఆహారం తీసుకునేటప్పుడు మితంగా తీసుకుంటారు. దీనిని స్నాక్ గా కూడా తసుకోవచ్చు. ఒక గ్లాస్ మఖానాలో 106 కేలోరీలు ఉంటాయి. దీనిని తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలగడంతో పాటు.. ఆకలి వేయకుండా కొద్ది సమయం వరకు ఉంచుతుంది. యాంటీ బయటిక్ లక్షణాలు తామర గింజల్లో సమృద్ధిగా ఉంటాయి. కనుక పూల్ మఖానాను రెగ్యూలర్ ఆహారంలో తీసుకుంటే లావు తగ్గొచ్చు.