మంత్రి కారు ఆపిన కార్మికుడు.. ‘సార్ నేను భిక్షగాడిని కాదు’ అంటూ..

లాక్‌డౌన్‌తో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ విషయం మరోసారి బయటపడింది. బెంగళూరు లోని జిల్లా ఇంచార్జి మంత్రి జగదీశ్‌ శెట్టర్‌ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు మంత్రి కారు వద్దకు వచ్చి.. సార్ బూట్‌ పాలిష్‌ చేస్తా అంటూ మంత్రి జగదీశ్ శెట్టర్ ను వేడుకుకున్నాడు.

బెంగళూరు నగరంలోని కిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో జరిగిన ఈ ఘటన కార్మికలు ఇబ్బందులను తేట తెల్లం చేస్తుంది. అయితే ఆ కార్మికుడికి జగదీశ్‌ శెట్టర్‌ డబ్బులు ఇవ్వబోగా.. ‘నేను అడుక్కునే వాడిని కాదు.. మిమ్మల్ని బిక్షం అడగడం లేదు.. లాక్ డౌన్ వల్ల మాకు ఉపాది పోయింది. దయచేసి మాకు ఉపాధి కల్పించి పుణ్యం కట్టుకోండి సార్‌’ అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ కార్మికుడుని సముదాయించిన మంత్రి జగదీశ్‌ శెట్టర్‌.. చివరకు రూ. 500 నగదు అతనికి ఇచ్చి ఇతనికి శాంతపరిచి పంపారు.