జగన్, నేను ఒకే జైలులో ఉన్నాం.. ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్.. మాకు జనరల్ జైలు.. కానీ జైలర్ అన్నమాటకు ఏడుపొచ్చేసింది. : కౌశిక్

ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణ కౌశిక్ తెలియని వారు ఎవరూ ఉండరు. ఈయన కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాల్లో సందడి చేశారు. ఇదిలా ఉండగా తాజాగా కృష్ణ కౌశిక్ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే గతంలో కృష్ణ కౌశిక్ టీవీ ఆర్టిస్టుల సమస్యలపై పోరాడటంతో అతనిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోని ఆయన ఆ జైలు అనుభవాల గురించి ముచ్చటించారు.

జగన్, నేను ఒకే జైలులో ఉన్నాం.. ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్.. మాకు జానరాల్ జైలు.. జైలర్ అన్నమాటకు ఏడుపోచ్చేసింది. : కౌశిక్

ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడుతూ నేను చంచల్ గూడ జైలులో అనుభవించిన జీవితాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలియజేశారు. జైలులోకి వెళ్ళగానే రిజిస్టర్ లో సంతకం చేయించుకొని తన ఒంటిపై ఉన్న దుస్తులను తీయించి తనని మొత్తం చెక్ చేశారని ఆ సంఘటనలను తాను ఎప్పటికీ మర్చిపోను అని కౌశిక్ ఈ సందర్భంగా వెల్లడించారు.

అదే సమయంలో జైలులో కూడా దొంగలు ఉన్నారని.. జైలులోకి వెళ్ళగానే ఎవరికి వారికి ఒక ప్లేటు, గ్లాసు, దుప్పటి ఇచ్చారని, అయితే ఎవరో తన ప్లేటు, గ్లాసు కొట్టేసారని చెప్పారు. అదే విషయం కానిస్టేబుల్ ని అడిగితే జైలులో దొంగలు ఉంటారు మీ వస్తువులు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారని ఫన్నీగా తన జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో జైలర్ వచ్చి మీరు ఫైట్ చేసిన కాజ్ చాల మంచిది సార్.. ఇప్పటికి కాకపొతే ఎప్పటికైనా మీకు అది సేవ్ అవుతుంది. అని అన్నారట.. ఒక జైలర్ ఆమాట అనడంతో ఆ సమయంలో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అని చెప్పారు కౌశిక్.

ఈ క్రమంలోనే కౌశిక్ మాట్లాడుతూ తాను చంచల్ గూడ జైలులో ఉన్న సమయంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే జైల్లో ఉన్నారని తెలిపారు. అయితే తాను ఎప్పుడూ కూడా అతనిని కలవలేదని జగన్ మోహన్ రెడ్డి గారు వీఐపీ బరాక్‌లో ఉంటే తాను జనరల్ బరాక్‌లో ఉండేవాడినని అందువల్ల తనని కలవలేకపోయానని ఈ సందర్భంగా కృష్ణ కౌశిక్ వెల్లడించారు