Ali – Vikram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న క్యారెక్టర్లు చేస్తూ.. స్టార్ గా ఎదిగాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ అపరిచితుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అంతకు ముందు కూడా విక్రమ్ పలు తెలుగు సినిమాల్లో నటించాడు. సేతు సినిమాతో తమిళంలో భారీ హిట్ కొట్టాడు. పితామగన్ తెలుగులో శివపుత్రుడు సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డ్ నే గెలుచుకున్నాడు విక్రమ్.
విక్రమ్ ముందుగా చోళా టీ, టవీఎస్ ఎక్సెల్, ఆల్విన్ వాచెస్‌కు మోడల్‌గా పనిచేసారు. ఆ తర్వాత ఓ టీవీ సీరియల్‌లో నటించారు. అటు తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, హరీష్ హీరోలుగా నటించిన ‘బంగారు కుటుంబం’లో నటించారు. కానీ అప్పటికే తమిళంలో ‘ఎన్ కాదల్ కణ్మణి’ చిత్రంలో హీరోగా నటించారు. అటు ‘అక్క పెత్తనం చెల్లెలు కాపురం’, ‘చిరునవ్వుల వరమిస్తావా’, ‘ఆడాళ్ల మజాకా’, మెరుపు, అక్కా బాగున్నావా, ఊహా, కుర్రాళ్ల రాజ్యం’, 9 నెలలు వంటి చిత్రాల్లో నటించారు.
ఇదిలా ఉంటే కమెడియన్ ఆలీ మాట్లాడుతూ… నా సినిమాలో విక్రమ్ విలన్ గా చేశాడని అన్నాడు. ‘ఆలీతో సరదాగా’ షోకు గెస్ట్ గా తెలుగు, తమిళ నటుడు శ్రీరామ్ ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు ఆలీ. అసలు ఆలీ హీరోగా.. విక్రమ్ విలన్ గా చేసిన సినిమా ఏమిటబ్బా అని అనుకుంటున్నారా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఒకప్పుడు కమెడియన్ ఆలీ ఇటు కమెడియన్ గా నటిస్తూనే… హీరోగా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆలీ హీరోగా నటించిన ‘ఊహా’ చిత్రంలో విక్రమ్ విలన్‌గా నటించారు. ఆలీని ఢీ కొట్టే విలన్ పాత్రలో చియాన్ అదిరిపోయే యాక్టింగ్ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…