Pawan Kalyan: నాకు చరణ్ కి గొడవ పెట్టే బాబాయ్ ఎంజాయ్ చేసేవాడు.. సుస్మిత కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా మారిపోయారు. ఈయన ఎన్నికలలో సాధించిన విజయాన్ని మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే మెగా కుటుంబంలో పెద్ద ఆడపడుచుగా ఉన్నటువంటి సుస్మిత ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈమె ఇటీవల పరువు అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5 లో ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుస్మిత పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ బాబాయ్ ని నేను ఎప్పుడు కూడా ఒక బాబాయిలా ఊహించుకోలేదు ఆయన నాకు పెద్దన్నయ్యతో సమానం అని తెలిపారు. మాతో బాబాయ్ చాలా సరదాగా ఉంటారు. ఇక చిన్నప్పుడైతే ఆయన నాకు చరణ్ కు మధ్య గొడవ పెట్టి ఆ గొడవతో ఎంటర్టైన్ అయ్యేవారని సుస్మిత తెలిపారు. ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం మమ్మల్ని బాగా వాడుకునేవారని సుస్మిత తెలిపారు.

అన్నయ్య తో సమానం..
ఇక రాజకీయాల గురించి కూడా ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ నాకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు కానీ బాబాయ్ ఎప్పుడైనా సక్సెస్ అవుతారని అనుకున్నాము కానీ ఊహించని విధంగా ఈ స్థాయిలో విజయం అందుకోవడంతో మా ఫ్యామిలీ మొత్తం సంబరాలలో మునిగి తేలుతున్నారని తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి సుస్మిత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.