Janasena: సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తున్నారు. ఈయన జనసేన పార్టీకి మద్దతు తెలియజేయకుండా వైసీపీ పార్టీకి తన స్నేహితుడికి మద్దతు తెలుపుతూ నంద్యాల పర్యటనకు వెళ్లారు. దీంతో ఈయన మెగా అభిమానులకు మెగా కుటుంబ సభ్యులకు టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబ సభ్యులు కొందరు ఈయనని అన్ ఫాలో చేయగా మరి మెగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేశారు. కానీ తన స్నేహితుడి కోసం వైసిపి పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం పట్ల విభేదాలు తలెత్తాయి. అయితే ఇలా అల్లు అర్జున్ జనసేనకు కాకుండా వైసీపీకి మద్దతు తెలియజేయడానికి పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది.
ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేస్తున్నారనే విషయం తెలుసుకున్నటువంటి అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ వ్యవహారాలను చెక్క దిద్దుతూ ఉన్నటువంటి బన్నీ వాసుకు జనసేన పార్టీ తరపున టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ని కోరారుట. ఇలా బన్నీ వాసుకు టికెట్ ఇవ్వాలని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన మాటలను లెక్క చేయలేదు.
టికెట్ ఇవ్వనందుకేనా..
ఈ విధంగా పవన్ కళ్యాణ్ బన్నీ వాసుకి టికెట్ ఇవ్వకపోవడంతో అల్లు అరవింద్ ఈ విషయంలో కాస్త నొచ్చుకున్నారని అందుకే అల్లు అర్జున్ సైతం జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసిపికి మద్దతుగా నిలిచారు అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇది మాత్రం వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…