Upasana: ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకున్న మెగా కోడలు ఉపాసన!

Upasana: ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకున్న మెగా కోడలు ఉపాసన!

Upasana: మెగా స్టార్ కోడలిగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అందరికీ సుపరిచితమే. ఉపాసన మెగా కోడలిగా మాత్రమే కాకుండా అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఎన్నో కీలక బాధ్యతలను నెరవేరుస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా ఉపాసన చేసే సామాజిక సేవా కార్యక్రమాల గురించి మనకు తెలిసిందే.

Upasana: ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకున్న మెగా కోడలు ఉపాసన!
Upasana: ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకున్న మెగా కోడలు ఉపాసన!

ఇక ఈ హాస్పిటల్ ఫౌండేషన్ ద్వారా నిత్యం హ్యూమన్ లైఫ్, వైల్డ్ లైఫ్ గురించి ఉపాసన నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఈ విధంగా సామాజిక సేవలో నిమగ్నమవుతూ ప్రజలకు కావలసిన వైద్య సేవలను అందిస్తూ మంచి గుర్తింపు పొందిన మెగా కోడలకు అత్యుత్తమైన అవార్డు వరించింది.

Upasana: ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకున్న మెగా కోడలు ఉపాసన!

2022 ఏడాదికి గాను నాట్‌ హెల్త్‌ సీఎస్‌ఆర్‌ అవార్డు అందుకున్నారు.అపోలో హాస్పిటల్ ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉపాసన చేస్తున్న కృషికి ఈ ఏడాది ఈమెను ఈ అవార్డు వరించింది. ఈ క్రమంలోనే ఈ అవార్డు అందుకున్న ఆయన మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమంలో తనని భాగం చేసినందుకు తన తాతయ్య, అపోలో హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ ఘనత దక్కుతుందని ఉపాసన వెల్లడించారు.

ఆయన స్ఫూర్తితోనే…

ఇక గ్రామీణభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను అందించాలనే తాతయ్య లక్ష్యమే తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించిందని ఉపాసన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ విధంగా అత్యుత్తమమైన పురస్కారానికి మెగా కోడలు ఎంపిక కావడంతో ఈమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు భర్త ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రశంసలు అందుకోగా భార్య ఉపాసన ఇలాంటి అత్యుత్తమమైన అవార్డు అందుకోవడంతో భార్య భర్తల జంట పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.