Salman Khan: దక్షిణాది సినిమాలు హిందీలోకి బాగా ఆడతాయి…మా సినిమాలు సౌత్ లో ఆడవెందుకో.. సల్మాన్ షాకింగ్ కామెంట్స్!
Salman Khan: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈయనకు సంబంధించిన షూటింగ్ కూడా సల్మాన్ ఖాన్ పూర్తి చేసుకున్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న RRR సినిమాపై బాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టింది.ఈ విధంగా వంద కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరడంతో చాలామంది ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఈ సినిమా విజయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని చరణ్ ఎంతో అద్భుతంగా నటించారని ఆయన్ని చూస్తుంటే చాలా గర్వకారణంగా ఉందని వెల్లడించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నందుకు రామ్ చరణ్ కు సల్మాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇక ఈ సినిమా విజయం గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ అదేంటో దక్షిణాది సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో అద్భుతంగా ఆడతాయి. కానీ మా బాలీవుడ్ చిత్రాలు సౌత్ ఇండస్ట్రీలో పెద్దగా ఆడవు. అసలు కారణం ఏంటో తెలియడం లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందంటూ సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపించారు.ప్రస్తుతం సౌత్ సినిమాలపై సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…