కరోనా ముందే నేను అవి వాడుతున్న.. నిజజీవితంలో నాకు ఆ సమస్య: మెహ్రీన్

మెహ్రీన్ ఈమె మొదట నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాథ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది మెహ్రీన్. ఈమె పూర్తి పేరు మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంది.

ముఖ్యంగా ఎఫ్ 2 లాంటి సినిమాల్లో అదిరిపోయే కామెడీతో నవ్వులు కూడా పూయించింది.ఇటీవలె ఈమె హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుటుంబానికి కోడలిగా వెళ్లనుంది అంటూ వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈమెకు తొలి సినిమా అయినా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతోనే మంచి గుర్తింపు దక్కింది.

ఆ తర్వాత ఈమె దర్శకుడు మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక త్వరలో f3 సినిమాతో ప్రేక్షకులను మరొకసారి పలకరించనుంది. ఇది ఇలా ఉంటే కరోనా మహమ్మారి మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చేతికి శానిటైజర్ లు వాడటం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా కూడా వారితో పాటు ఈ శానిటైజర్ తీసుకు వెళుతూ ఉండేవారు. కానీ మెహ్రీన్ మాత్రం కరోనా రాకముందు నుంచే ఈ శానిటైజర్ లను వాడేదట.

ఇక తాజాగా మెహ్రీన్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. మహానుభావుడు సినిమాలో హీరోయిన్ శర్వానంద్ కు ఓసిడి ఉంటుంది. కానీ తనకు రియల్ లైఫ్ లో అంతకన్నా ఎక్కువ ఓసిడి ఉందని తెలిపింది.కరోనా వచ్చిన తర్వాత అందరూ శానిటైజర్ లు వాడుతున్నారు. కానీ ఆమెకు మాత్రం కరోనా ముందు నుంచి ఈ శానిటైజర్ లో వాడటం అలవాటు ఉందట. అప్పట్లో ఆమె బ్యాగులో 2,3 శానిటైజర్ బాటిళ్లు ఉండేవట. కానీ ప్రస్తుతం 6,7 ఉంటున్నాయి అని ఆమె తెలిపింది. తను మేకప్ వేసుకునే ముందు చేతులకు శానిటైజర్ రాసిన తర్వాత తన ఫేస్ ను టచ్ చేస్తుందట. తనకు మొదటి నుంచి ఈ ఓసిడి ఉందని తెలిపింది.