టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎవరే అతగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు.
అయితే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే ప్రియమణి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. భర్త ముస్తఫా రాజ్ మొదటి భార్య కొన్ని ఆరోపణలు చేయడంతో ప్రియమణి వైవాహిక జీవితం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.ప్రియమణి భర్త పై మొదటి భార్య కేసు నమోదు చేసింది.
ప్రియమణి భర్త ముస్తాఫా రాజ్ కు గతంలోనే ఆయేషా తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం కూడా ఉన్నారు. ముస్తఫా ఆయేషా ఇప్పటికి విడాకులు తీసుకోలేదని అని ఆరోపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి ప్రియమణి,ముస్తఫా ల మధ్య గొడవలు వచ్చాయని వీరిద్దరి విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
తాజాగా ప్రియమణి ఈ వార్తలన్నింటికి చెక్ పెడుతూ దీపావళి పండుగ సందర్భంగా తన భర్త ముస్తఫా తో కలిసి దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పంచుకుంది. దీనితో విడాకుల విషయం పై వినిపిస్తున్న రూమర్స్ కు ప్రియమణి పరోక్షంగా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…