Featured

చిరంజీవి సినిమాలో హీరోయిన్ కంటే డబుల్ రెమ్యునరేషన్ తీసుకున్న పొగరుబోతు అత్త ఎవరో తెలుసా..?!

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమారుడైన అల్లుఅరవింద్ 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బంట్రోతు భార్య చిత్రం ద్వారా గీతా ఆర్ట్స్ బ్యానర్ ని ప్రారంభించారు. ఆ క్రమంలో గీతా ఆర్ట్స్ సంస్థ చిరంజీవితో అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. యమకింకరుడు చిత్రంతో ప్రారంభమై శుభలేఖ, హీరో , పసివాడి ప్రాణం, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, మెకానిక్ అల్లుడు, మాస్టర్, అన్నయ్య, డాడీ వంటి చిత్రాలను చిరంజీవితో నిర్మించడం జరిగింది.

ఇందులో పసివాడి ప్రాణం, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు చిత్రాలు ఇండస్ట్రీ హిట్ గా నిలువగా, శుభలేఖ, విజేత, రౌడీ అల్లుడు, అన్నయ్య వంటి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. 1989 గీతాఆర్ట్స్ బ్యానర్, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్తకి యముడు అమ్మాయికి మొగుడు చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ రోజుల్లో అత్తా అల్లుళ్ళ సవాల్ తో వచ్చిన చిత్రాలన్నీ దాదాపుగా విజయవంతమయ్యాయి. 1988 చిరంజీవిని సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా మార్చిన సంవత్సరం. ఈ సంవత్సరంలోనే చిరంజీవి యముడికి మొగుడు తో ఇండస్ట్రీ హిట్, ఖైదీ నెంబర్ 786తో సూపర్ హిట్స్ అందుకున్నారు.

ఆ క్రమంలో చిరంజీవితో హాలీవుడ్ రేంజ్ లో ఒక సినిమా చేద్దాం అనుకుని అనివార్య కారణాలవలన రద్దు కావడం జరిగింది. ఇదే సమయంలో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చిరంజీవి డేట్స్ తీసుకుని మంచి కథ తయారు చేయమని సత్యానంద్ ను కోరడం జరిగింది. ఆ క్రమంలో ఆంధ్ర ప్రజలకు అత్తా అల్లుళ్ళ మధ్య వచ్చే కథలను ఇష్టపడతారని అలాంటి కథను ఒకటి ఆయన రాయడం జరిగింది. హీరోయిన్ గా విజయశాంతి అనుకున్నప్పటికీ, అత్తగా ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో సీనియర్ నటి జమున గారి ప్రస్తావన వచ్చింది. కానీ సత్యానంద్ తన కథ వాణిశ్రీని అత్తగా అనుకోని రాయడం జరిగింది. ఆ విషయాన్ని దర్శక నిర్మాతలతో చెప్పడంతో అంగీకరించారు.

వాణిశ్రీ దాదాపుగా 8 సంవత్సరాల నుండి సినిమాలకి దూరమయ్యారు. ఈ సినిమాలో ఆమె నటిస్తుందో లేదో అని సంప్రదించగా.. హీరోతో సమానంగా అత్త పాత్ర ఉండడంతో హీరోయిన్ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకొని అత్తకి యముడు అమ్మాయికి మొగుడు చిత్రంలో వాణిశ్రీ నటించడానికి ఒప్పుకొన్నారు. అత్తకి యముడు అమ్మాయికి మొగుడు చిత్రంలో హీరోతో సరిసమానంగా సన్నివేశాలు, సంభాషణలు, వాణిశ్రీకి ఉండడం గమనార్హం. వీరి మధ్య వచ్చే సన్నివేశాలకు, వాణిశ్రీ పై చిరంజీవి చెప్పే సంభాషణ నువ్వు ఆంధ్ర క్వీన్ కావచ్చు.. నేను మాత్రం ఆంధ్ర.. నాతో ఎందుకు చెప్పిస్తావ్ ఇదివరకు నువ్వు వినే ఉంటావు లాంటి డైలాగ్స్ కి ప్రేక్షకులు ఈలలు కొట్టారు.

చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. ‘మెరుపులా లా లా ఆడతా తా..’ ఓం శాంతి… పాటలకు చిరంజీవి చేసిన డాన్స్ కి ఫిదా కానీ ప్రేక్షకుడు అంటూ ఉండరు. 1989 జనవరిలో వచ్చిన అత్తకి యముడు అమ్మాయికి మొగుడు చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. ఇదే చిత్రాన్ని రజినీకాంత్ అమలా కాంబినేషన్ లో ‘మాపిళ్లై’ అనే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. అక్కడ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా 100 రోజుల పండుగను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించారు. ఈ సినిమా ప్రభావంతో తెలుగు లో ఇలాంటి కథతో అనేక చిత్రాలు రూపొందడం గమనార్హం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago