కరోనా మృతుల కుటుంబాలలో పెరుగుతున్న మానసిక జబ్బులు.. కారణం అదేనంటున్న నిపుణులు!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తూ ఎంతోమంది ప్రాణాలను తీసింది. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.ఈ విధంగా కరోనా బారిన పడి మరణించిన వారి కుటుంబాలలో ఎన్నో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని తాజాగా నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మృతుల కుటుంబాలలో మానసిక సమస్యలు రావడానికి గల కారణాలను నిపుణులు తెలియజేశారు.

ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కరోనా బారిన పడితే వారి ద్వారా మొత్తం కుటుంబ సభ్యులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే తమ కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనాతో మరణిస్తే వారు కేవలం నేను చేసిన తప్పిదం వల్లే నా కుటుంబ సభ్యుని కోల్పోయామనే భావన వారిలో బలంగా నాటుకు పోతుంది. నా వల్లే అతడు ప్రాణాలు కోల్పోయాడు అనే ఆలోచన, అపరాధ భావంతో కుంగిపోతూ వారి మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోని కరోనా నుంచి బయటపడిన తర్వాత కూడా వీరు సాధారణ మానసిక స్థితికి రాలేక పోతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ సందర్భంలోనే ఈ సమస్యలతో బాధపడుతూ డాక్టర్లను సంప్రదించే వారి సంఖ్య అధికమవుతుందని సైకాలజిస్ట్లు తెలియజేస్తున్నారు.ఇది ఎక్కువ కాలం కొనసాగితే ఇతర ప్రమాదానికి దారితీస్తుంది. బాధితులు ఆత్మహ్యత్య చేసుకునే అవకాశమూ ఉందని నిపుణుల తెలియజేశారు.

ఈ విధంగా మానసికంగా ఆందోళన చెందే వారిని మొదట్లోనే గుర్తించి వారికి సరైన సమయంలో నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా ఫలితముంటుందని, మరికొందరిని ఆధ్యాత్మికం వైపు దృష్టి సారించడం వల్ల ఫలితాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మానసికంగా కృంగి పోయే వారిని ఏమాత్రం అలసత్వం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి సకాలంలో చికిత్స అందించాలి.