మినీ బస్సులను అంబులెన్సులుగా మార్చి.. కోవిడ్ బాధితులకు అలా సేవలు?

దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో తీవ్రమైన అంబులెన్స్ కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం మహారాష్ట్రలోని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక చర్యలు చేపట్టాయి.

ఈ క్రమంలోనే నగరంలో ఏర్పడిన ఆంబులెన్స్ కొరతను తీర్చేందుకు మినీ బస్సులను అంబులెన్సులుగా మార్చింది. మొత్తం 25 మినీ బస్సులను అంబులెన్సులు గా మార్చి కోవిడ్ బాధితులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.మహారాష్ట్రలో అంబులెన్స్ కొరత ఉండటం వల్ల ఇప్పటి వరకు కరోనా బాధితులు ప్రైవేట్ అంబులెన్స్ లో ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ అంబులెన్సులు వేలకు వేలు డబ్బులు తీసుకోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు.

కేవలం పది రోజుల వ్యవధిలోనే 25 మినీ బస్సులలో ఉన్న సీట్లను తొలగించి కరోనా బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. బెడ్, ఆక్సిజన్ సిలిండర్ వంటి సదుపాయాలను అంబులెన్స్ లో అమర్చి కరోనా బాధితులకు అందుబాటులోకి తేనున్నారు. ఈ అంబులెన్స్ సేవలను అందుకోవడం కోసం ప్రత్యేకమైన 0712 2551417 హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

కరోనాతో బాధపడేవారు అంబులెన్స్ ల కోసం ఈ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే చాలు అంబులెన్స్ స్వయంగా బాధితుల ఇంటి దగ్గరకు చేరుకుని వారిని ఆస్పత్రిలో చేరుస్తారని మహారాష్ట్ర అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.