AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!

AP: ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తుతం ఎన్నో సందేహాలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నో ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఒకటో తేదీ రానే వస్తుంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేయాలి అంటే తప్పనిసరిగా వాలంటీర్లు అవసరం కనుక జూలై ఒకటో తేదీకి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఇలా వాలంటీర్ గురించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ఇకపై ఉండదని తేల్చి చెప్పారు.

ఇంటింటికి పెన్షన్ అందజేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సచివాలయ ఉద్యోగస్తులను నియమించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ ఉండదని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. వాలంటీర్లతో పాటు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లతో ఇంటింటికి వెళ్లి పించని పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పెన్షన్ల బాధ్యత సచివాలయ సిబ్బందికి అప్పగించారు ఇక రేషన్ పాత పద్ధతిలోనే రేషన్ షాపు వద్దకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి తరుణంలో వాలంటీర్ వ్యవస్థతో పనిలేదని అందుకే వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతుంది. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలో వాలంటీర్లు..
గత ప్రభుత్వం 5000 రూపాయల గౌరవ వేతనం చెల్లించింది కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పడంతో ఎంతో మంది వాలంటీర్ ఉద్యోగం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయనకు ఓట్లు కూడా వేశారు కానీ గెలిచిన తర్వాత ఇలా వాలంటీర్ వ్యవస్థ గురించి నిర్ణయం తీసుకోకపోవడం వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పడం పట్ల వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.