Ali: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారందరూ కూడా రాజకీయాలలోకి వస్తున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అలీ సైతం రాజకీయాలలో కొనసాగిన సంగతి మనకు తెలిసిందే.
గతంలో పలు పార్టీలలో ఉన్నటువంటి ఈయన 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. ఇలా పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఈయనకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కూడా పదవి అప్పగించారు. ఇక 2024 ఎన్నికలలో తనకు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా టికెట్ వస్తుందని భావించారు.
ఇలా తనుకు టికెట్ వస్తుందని ఆశించిన అలీకి నిరాశ ఎదురయింది. అంతేకాకుండా ఈసారి ఎన్నికలలో పార్టీ తరఫున కూడా ఈయన ప్రచార కార్యక్రమాలను నిర్వహించకుండా పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక వైసీపీ ఘోర ఓటమి పాలు కావడంతో ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు కూడా లేవు.
సామాన్య పౌరుడిగా..
ఇలా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి ఈయన ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడమే కాకుండా ఇకపై తాను ఎలాంటి రాజకీయ పార్టీలలోకి వెళ్లనని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. ఒక సామాన్య పౌరుడిగా మాత్రమే నేను నా ఓటు హక్కును వినియోగించుకుంటానని ఈ సందర్భంగా ఆలీ తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…