ఆ పక్షి ఈక ధర ఎంతో తెలుసా.. బంగారం కంటే అధిక ధర.. ఏంటి దాని ప్రత్యేకత?

ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. మనకు తెలియని ఎన్నో రకాల జంతువులు, పక్షులు కూడా మనకు వింతగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే.. ఓ పక్షి ఈకలకు ఎక్కడ లేని డిమాండ్ ఉంది. బంగారం కంటే అధిక ధరకు ఆ ఈకలను కొంటారు. వీటిని సేకరించే వారు కూడా వీటి కోసం ఎంతలా కష్టపడుతారో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ పక్షి పేరు ఈడర్ పోలార్ డక్. ఇది ఐస్‌ల్యాండ్‌లో మాత్రమే నివసిస్తుంది. దీని ఈక ప్రపంచంలోనే అత్యధిక విలువతో అమ్ముడుపోయింది. ఎందుకంటే ఇది ప్రపంచంలోని హాటెస్ట్ సహజ ఫైబర్‌గా పరిగణించబడుతుంది.

లగ్జరీ బ్రాండ్లు తమ ఉత్పత్తుల్లో ఈ ఈకను ఉపయోగిస్తారట. దీని బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని మనం శరీరానికి హత్తుకుంటే వెచ్చగా ఉంటుంది. శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఈ ఫైబర్ అంతర్జాతీయ మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. ఆ ఈకలోని ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఫైబర్ చాలా తేలికగా ఉంటుంది.

దాని ధర ఎంత అంటే 800 గ్రాముల ఫైబర్ ధర దాదాపు 5000 డలర్లు ఉంటుంది. మన కరెన్సీలో దాదాపు రూ. 3.71 లక్షలు అన్నమాట. ఆ పక్షి గుడ్లు పొదిగే సమయంలో అక్కడి ప్రజలు వాటి ఈకలను సేకరించేందుకు వెళ్తుంటారు. వీటిని సేకరించేందుకు సంవత్సరానికి మూడుసార్లు మాత్రమే బయటకు వెళ్తారు. సుమారు 60 బాతుల గుడ్లను సేకరిస్తారట. గుడ్లను సేకరించే క్రమంలో బాతులను సజీవంగా ఉంచడం విశేషం.