సెలబ్రిటీల చిన్న నాటి ఫొటలు చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్ల ఆసక్తికి అనుగుణంగా కొన్నిసార్లు సెలబ్రిటీలు కూడా తమ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్త కొన్ని నిమిషాల వ్యవధిలోనే వైరల్ అవుతూ ఉంటాయి. లక్షల కొద్ది షేర్ లు, లైక్ లు పడుతుంటాయి.
అంతేకాకుండా ఆ ఫొటోలను చూసి అభిమానులు రకరకాలుగా ముచ్చటిస్తుంటారు. అయితే ఇక్కడ ఓ సెలబ్రిటీ తన చిన్ననాటి ఫొటో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన చైల్డ్‌హుడ్ పిక్ ఇది. ముసి ముసిగా నవ్వుతూ.. అందమైన డ్రెస్‌లో చందమామలా కెమెరాకు ఫోజిచ్చింది ఈ చిన్నారి.
ఆమె టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు మాత్రమే కాదు యువ హీరోలతో సైతం జత కట్టింది. తమిళ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇంతకూ ఆ హీరోయిన్ పేరు ఏంటంటే.. కాజల్ అగర్వాల్. చందమామ సినిమాలో నటించి ఎంతో ఫేమ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇలా చూడచక్కటి డ్రస్ లో ఫోజిచ్చింది. ఈ పిక్ సోషల్ మీడియాలో తెలగ వైరల్ అవుతోంది. కొంతమంది ఆ ఫొటోను తన స్నేహితులకు షేర్ చేస్తూ ఎవరో గుర్తుపట్టండంటూ ఫజిల్ కూడా పెట్టేస్తున్నారు. ప్రస్తుతం కాజల్.. తెలుగులో ఆచార్యలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పలు భాషల్లో ఆరు నుంచి ఏడు సినిమాల్లో నటిస్తోంది. ఉమా, ప్యారిస్ ప్యారిస్, హే సినామికా, కరునగాపియం, ఘోస్టీ మరియు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2(ఇండియన్ 2) సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…