Categories: FeaturedMovie News

కారులో దీపని చూసిన మోనిత.. దుర్గ కోసమంటూ ఝలక్ ఇచ్చిన దీప..!

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1109 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి నేటి హైలెట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. అంజి కోసం ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మోనిత ఎవరికో ఫోన్ చేసి సూర్యాపేట హోటల్ 8 నుంచి ఒక క్యాబ్ బుక్ చేయమని చెబుతుంది అయితే అది తన ఇంటికి కాదు యాదగిరిగుట్టలో ఉన్న తన ఫామ్ హౌస్ కి అని చెప్పగానే అంజిని కిడ్నాప్ చేసి అక్కడ ఉంచాలి అనుకుంటుంది అంటూ మోనిత ప్లాన్ పసిగట్టిన దీప
తనకు చిన్న ఝలక్ ఇవ్వాలని భావిస్తుంది.అప్పుడే వాటర్ బాటిల్ కనిపించలేదు వెంకట్ కాస్త లైట్ అనగానే.. ఇదేంటి దీప గొంతులా ఉందని వెనక్కి తిరిగి చూస్తుంది. కారులో దీపని చూసేసరికి మోనిత ఎంతో షాక్ అవుతుంది.

అక్క అప్పటి నుంచి నువ్వు కారులోనే ఉన్నావా.. నువ్వు ఉన్నావని తెలియక ఖాళీగా కూర్చున్నాను. బాబు కాస్త కారు ఆపు అని చెప్పి మోనిత దీప దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. ఇంకేంటి అక్క విశేషాలు అని అడగగా… రేపు తీరిగ్గా తెలుసుకుంటావులే అంటూ సమాధానం చెబుతుంది. ఇక డ్రైవర్ టీ తాగడానికి కారు పక్కన ఆపితే వీరిద్దరు బయట దిగి కొంచెం ఫ్రీగా మాట్లాడుకుందామా అంటూ మాట్లాడుతారు.. అయినా నా ఎక్కడికి వెళుతున్నావు ఈ వేళప్పుడు అంటూ మోనిత దీపను అడగగా… దుర్గ దగ్గరికి అంటూ షాక్ ఇస్తుంది. దుర్గ పేరు వినగానే కంగారుపడిన మోనిత ఇప్పుడు వీడిని తీసుకువచ్చి నా పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేస్తోందా.. అంటూ కంగారు పడుతుంది. అదే విజయవాడలో దుర్గఉంది కదా.. దుర్గా దేవికి వెళ్తున్నాను అని చెప్పడంతో మోనిత ఊపిరి పీల్చు కుంటుంది.

చాలా రోజుల నుంచి ఎంతో చిరాకుగా ఉన్నాను అందుకోసమే గుడికి వెళదామని వెళ్తున్నా… అయినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ అని దీప అడగగా.. రేపు నా పెళ్లి కదా.. సాయంత్రమే రిసెప్షన్ ఈ హోటల్లో వంటవాళ్ళు వంట బాగా చేస్తారని వాళ్లని తీసుకువెళ్లడానికి వచ్చాను అని సమాధానం చెబుతుంది. తీసుకెళ్ళు దోసకాయ పచ్చడి బాగా చేయించు.. అవి డాక్టర్ బాబుకు చాలా ఇష్టం అని సమాధానం చెబుతుంది. నేనే ఉంటే దోసకాయ పచ్చడి రోట్లో వేసి బాగా దంచే దాన్ని నీ తలకాయ మాదిరిగా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇక దీపను బాధపెట్టాలని..గుడికి ఎవరు దిక్కులేని దానిలా ఒక్కటే వెళ్లకపోతే పిల్లలని కార్తీక్ ని తీసుకువెళ్ళవచ్చు కదా అంటూ దెప్పి పొడుస్తుంది. డాక్టర్ బాబుని తీసుకు వెళ్తే పిరికివాడిలా పారిపోయాడని నువ్వే అంటావు కదా.. అందుకే రేపు జరగబోయే రచ్చకు ఎనర్జీ కావాలని విశ్రాంతి తీసుకోమని చెప్పాను అంటూ సమాధానం చెబుతుంది.

దీపలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి ఏంటి దీనికి ధైర్యం అని మనసులో అనుకుంటుంది. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి చివరికి మోనితను దింపి కారు విజయవాడ వైపు వెళ్తుంది. దీపకి నాపై అనుమానం రాలేదు అంటూ మోనిత సంతోషపడుతుంది. ఇక అంజి ఉన్న హోటల్ కి వెళ్లి అంజి రూమ్ డోర్ కొట్టగానే అంజి తలుపుతీసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంజిని చూడగానే తన కాళ్ళపై పడి తనను క్షమించమని తను మారిపోయానని, తన తప్పును తెలుసుకొని కార్తీక్, దీపను కలిపానని, తాను పెళ్లి చేసుకోబోతున్నాను తన పెళ్ళికి రమ్మని అడుగుతుంది.మోనిత మాటలు విన్న అంజి కథ బాగా చెప్తున్నావు నీకు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు.. నా కాళ్లు పట్టుకున్నావంటే నీకు ఏదో పెద్ద ప్రమాదం ఉంది అందుకే నా కోసం వెతుక్కుంటూ వచ్చావ్ అంటూ సమాధానం చెబుతాడు. ఇలా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? ఏంటి ?అనేది తరువాత ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago