MS Dhoni: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియాలో కీలక బాధ్యతలు చేపట్టనున్న ఎంఎస్ ధోని?

MS Dhoni: టి20 ప్రపంచ కప్ 2022 లో భారత్ ఘోర వైఫల్యం ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి టీమిండియా టి20 సిరీస్ ప్రపంచ కప్ మ్యాచ్లలో ఘోర వైఫల్యం చెందుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది.ఇక టి20 ప్రపంచ కప్ 2020 మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లలో ఇండియా గత కొన్ని సంవత్సరాల నుంచి పరాజయం కావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2013 వ సంవత్సరం నుంచి ఐసీసీ చాంపియన్ ట్రోఫీ భారత్ కి దూరంగా ఉంది. ఈ క్రమంలోనే 2024 ప్రపంచ కప్ టీమ్ ఇండియాలో కీలక మార్పులు చేసే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది.

భారత క్రికెట్ డైరెక్టర్ గా ధోని…

ఈ క్రమంలోనే భారత క్రికెటర్ డైరెక్టర్ గా నియమించే అందుకు ఎంఎస్ ధోని పేరును తెరపైకి తీసుకువస్తున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంఎస్ ధోనిని నియమిస్తే రాహుల్ ద్రవిడ్ కి కాస్త పని భారం తగ్గుతుందని చెప్పాలి. టెస్ట్ వన్డే ఫార్మాట్లలో ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యత ద్రవిడ్ కి అప్పజెప్పగా, టి20 మ్యాచ్ లలో ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యత ఎంఎస్ ధోనీకి అప్పగించనున్నట్టు సమాచారం.ఈ విధంగా టీవి ఇండియాలో కీలక బాధ్యతలను ఎమ్మెస్ ధోనీకి అప్పగించనున్నారని తెలియడంతో ధోని అభిమానులు క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.