Director Madan: సినీ పరిశ్రమను వరుస మరణాలు కుదిపేస్తున్నాయి.ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమలో వరుసగా సెలబ్రిటీలు మరణించడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో గడిచిన రెండు నెలల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు మరణించారు. ఇక నట శేఖర్ కృష్ణ మరణ వార్త మరచిపోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన మదన్ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఆ నలుగురు సినిమాతో రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మదన్ పెళ్లయిన కొత్తలో సినిమాతో దర్శకుడిగా మారారు. అనంతరం గరం ప్రవరాఖ్యుడు కాఫీ విత్ మై వైఫ్ గాయత్రి వంటి సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు.
సినిమాపై ఫ్యాషన్ తో చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించినటువంటి మదన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి రచయితగా కో డైరెక్టర్ గా డైరెక్టర్ గా వ్యవహరించారు. అయితే గత మూడు రోజుల నుంచి ఈయన అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉండగా శనివారం సాయంత్రం ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు.
బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించిన మదన్…
ఈ విధంగా డైరెక్టర్ మదన్ మరణ వార్త తెలుసుకున్నటువంటి చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఆయన మరణం పై స్పందిస్తూ నివాళులు అర్పించారు. ఇక ఈయన ఆఖరి చిత్రం గాయత్రి. ఇలా మదన్ మరణించడంతో పలువురు సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…