Krishna – Mahesh Babu : 1984లో సూపర్ స్టార్ కృష్ణ కంచు కాగడా, నాయకులకు సవాల్, దొంగలు బాబోయ్ దొంగలు, రక్త సంబంధం లాంటి చిత్రాల్లో నటించారు. ఇదే సంవత్సరంలో విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి ‘రక్తసంబంధం’ మరొకటి ‘ముఖ్యమంత్రి’ చిత్రాలు. 1984 శ్రీనివాస్ రెడ్డి నిర్మాణం, విజయనిర్మల దర్శకత్వంలో ‘ముఖ్యమంత్రి’ చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో కృష్ణ, అంబికా హీరో, హీరోయిన్లుగా నటించారు. రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య లాంటి వారు ఇతర తారకనంగా పేర్కొనవచ్చు. చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా చేరింది. ఆ ఏడాది రాజకీయ నేపథ్యంతో కూడిన రెండు చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. నాయకులకు సవాల్ యావరేజ్ గా నిలువగా ముఖ్యమంత్రి చిత్రం విజయవంతంగా నిలిచింది.
‘భరత్ అనే నేను’ 2018లో కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. మహేష్ బాబు కధానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మించగా కైరా అడ్వాణీ కథానాయికగా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు. ఈ చిత్రం ఒక విద్యార్థి గురించి.అతని పేరు భరత్. అనుకోకుండా అతను ఆంధ్రప్రదేశ్ నాయకుడు అవుతాడు. అతను రాజకీయాలను సంస్కరించడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమా పాలిటిక్స్ ఆక్షన్ మిక్స్ అయినా సినిమా.
చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా’.. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ కనిపించాడు.
ఆయన వేషధారణ మాత్రం ఓ రాజకీయ నాయకుడిలా లేకుండా చాలా స్టైలిష్‌గా ఉంది. ‘కానీ.. ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్ ఐ యామ్ ఎ మ్యాన్ (ఎందుకంటే నేను మనిషిని). విఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ (మనం సమాజంలో నివసిస్తున్నాం). ప్రతి ఒక్కళ్లకి భయం, బాధ్యత ఉండాలి.. ప్రామిస్’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్ మొత్తం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇలా తండ్రి కొడుకులు ముఖ్యమంత్రిగా తెరపై కనిపించిన సినిమాలలో కృష్ణ నటించిన ‘ముఖ్యమంత్రి’ సినిమా విజయవంతం అవగా మహేష్ బాబు నటించిన “భరత్ అనే నేను” చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…