మురళీ మోహన్ కుటుంబానికి భారీ ఊరట

మాజీ ఎంపీ,జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్ ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనను మోసం చేశారని ఓ భూయజమాని ఇచ్చిన ఫిర్యాదుతో మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులను ఎపీ సీఐడీ కేసు నమోదు చేసింది. తర్వాత విచారణకు రావలంటూ 41A సెక్షన్ కింద నోటీసు జారీ చేసింది. దీంతో సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టులో క్వ్యాష్ పిటీషన్ వేశారు మురళీ మోహన్. జయభేరి ప్రాపర్టీస్ తరుపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్.. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మారుస్తున్నారని సీఐడీ ప్రవర్తనను తప్పుబడుతూ అభ్యత్రం వ్యక్తం చేశారు.

ఈ వాదనలు విన్న ఏపీ హైకోర్డు ఈ కేసులో సంబంధించిన తదనంతర చర్యలు నిలిపివేయాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిర్ణయంతో మురళీ మోహన్ కుటుంబానికి ఊరట లభించినట్లైంది.