ఆ సినిమాతో కొన్ని కోట్లు నష్టపోయా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మురళీమోహన్..

మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడిగా.. జయభేరి గ్రూపు అధిపతిగా.. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుంచి గెలిచి ఎన్నో మైలురాళ్లు దాటాడు. తాజాగా అతడు ఓ యూట్యూబ్ చానల్ ఇటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

అవేంటంటే.. మొదటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరిక బలంగా అతడతికి ఉండేదట. తన తండ్రి పాలిటిక్స్ లో ఉండటంతో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో వర్కింగ్ పార్టనర్ గా వర్క్ చేసేందుకు ఆఫర్ రాగా.. నెలకు రూ.100 జీతం.. లాభాల్లో వాటా కూడా ఇచ్చినట్లు చెప్పాడు. అదే కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పాడు. అందులోనే 10 ఏళ్ల చేసినట్లు చెప్పాడు. అందులో దాదాపు 50 శాతం షేర్ కూడా తెచ్చుకున్నాడట. హీరోగా అతడికి ఆఫర్ రాగా.. వెళ్లినట్లు చెప్పాడు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేసినట్లు చెప్పాడు.

తర్వాత రెండో సినిమాకు సంవత్సరం వెయిట్ చేశానని.. తర్వాత దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో చేసిన తర్వాత మంచి గుర్తింపు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. తర్వాత దాసరి సినిమాల్లోనే ఎక్కువగా నటించినట్లు పేర్కొన్నాడు. ఈ మధ్యలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరించినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఒక సినిమా హిట్ అయితే అందరూ ఆనందాలను పంచుకుంటారు.. ఒక వేళ ఫెయిల్ అయితే మాత్రం నిర్మాతమీదనే ఎక్కువగా తోసేస్తున్నట్లు చెప్పాడు.

మణిరత్నం సినిమా అయిన ‘ఇద్దరు’ సినిమాలో కరుణానిధి,  ఎంజీఆర్ కు సంబంధించిన సినిమా అని.. అందులో కరుణానిధి క్యారెక్టర్ ను నెగెటివ్ గా.. ఎంజీఆర్ క్యారెక్టర్ ను పాజిటివ్ గా తీశారు. అందులో తమిళనాడులో కరుణానిధి అధికారంలోకి రావడంతో.. ఆ సినిమాలో చాలాసీన్లు కట్ చేసినట్లు చెప్పాడు. దీంతో ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయిందని.. అప్పటి వరకు సంపాదించిన సంపద అంతా పోయిందని చెప్పాడు మురళిమోహన్.