Music director Koti : చిత్ర, బాలు పాడితే ఆ పాటలు వాళ్ళవి అయిపోతాయా?? ఈవెంట్లు పెట్టి పాడిస్తుంటారు.. కంపోజ్ చేసింది నేను : మ్యూజిక్ డైరెక్టర్ కోటి

Music director Koti : సాలూరి రాజేశ్వర్రావు గారి తనయుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తండ్రి లాగానే సంగీత దర్శకుడిగా మారిన సాలూరి కోటేశ్వరరావు అలియాస్ కోటి గారి సంగీతం గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కోటి మొదట రాజ్ తో కలిసి రాజ్-కోటి కాంబినేషన్ లో చాలా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఇక ఆ తరువాత ఇద్దరూ పలు కారణాలతో వీడిపోయి ఎవరికి వారు సొంతంగా మ్యూజిక్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో కూడా హిట్లర్, హలో బ్రదర్, బంగారు బుల్లోడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి కోటి గారికి. చిరంజీవి కాంబినేషన్ లో దాదాపు 11 సినిమాలు చేసి హిట్లు కొట్టిన కోటి గారికి చిన్న చిన్న మనస్పర్తల కారణంగా చిరంజీవి గారికి దూరం అయ్యారు. ఇక కెరీర్ లో ఒడదుడుకులను ఇంటర్వ్యూలో పంచుకున్నారు కోటి.

సింగర్స్ పాడితే వాళ్ళ పాట అయిపోదుగా…

ఒక పాట కంపోజ్ చేయాలంటే ఒక స్వరకర్త బాగా కష్టపడుతాడు. ఒక్కోసారి దర్శకుడికి నచ్చకపోతే మళ్ళీ మార్చాలి, మళ్ళీ సలహాలు కూడా ఇస్తారు వాటిలో అన్నీ అయ్యాక ఒక పాట ట్యూన్ చేసి పలానా సింగర్ తో పాడిస్తే పాట హిట్ అయితే క్రెడిట్ అంత సింగర్ కి ఇస్తారు. ఇక ఆ సింగర్ పాట అయిపోతుంది అది.

ఒక పాట ఎస్పి బాలు గారు పాడి హిట్ అయితే ఆ పాట ఇక బాలు గారిది అంటూ అయిపోతుంది. ఈవెంట్లు పెట్టి బాలు గారి పాటలు అంటూ పాడేస్తారు. అసలు ఆ పాట సింగర్ ది ఎలా అవుతుంది పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ది కదా. సింగర్ పాడినందుకు క్రెడిట్ ఇవ్వడం తప్పు కాదు కానీ కాంపోజ్ చేసిన వ్యక్తిని గుర్తించక పోతే ఎలా అంటూ చెప్పారు.