ఈ వింత పదార్థం గురించి మీకు తెలుసా?

సాధారణంగా మనం ఎప్పుడూ చూడని జంతువులను, వింత జీవులను చూసినప్పుడు కొంతవరకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తాము. ఆ జీవులు చూడటానికి ఆహ్లాదంగా కనిపిస్తే వాటిని తరచూ చూస్తుంటాము. మరి కొన్ని జంతువులు చూడటానికి ఎంతో భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి ఎంతో ఆశ్చర్యం కలిగించే జీవుల గురించే మనం ఎన్నోసార్లు వినే ఉంటాం.

తాజాగా ఈ విధమైనటువంటి ఓ వింత జీవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సముద్రతీరంలో ఓ వింత పదార్థాన్ని నార్త్‌ కరోలినా తీరంలో నేషనల్‌ పార్క్‌ అధికారులు కనుగొన్నారు. ఇది చూడటానికి గజిబిజీగా ఉంది. ఈ జీవికి కాళ్లు, చేతులు, తల, వంటి భాగాలు కూడా లేవు. ఎంతో విచిత్రమైన ఆకారం కలిగి ఉన్న ఈ జీవిని కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు.

ఈ వింత పదార్థాన్ని ఫేస్ బుక్ ద్వారా షేర్ చేస్తూ ‘అంతుచిక్కని పదార్థం’ అని క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫోటోలో ఉన్న జీవి కొన్ని నెలల క్రితమే  సముద్ర ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. వింత ఆకారంలో కలిగి ఉన్న ఈ పదార్థాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పదార్థం వైరల్ గా మారింది. ఈ పదార్థం ఏంటో గుర్తించడం కోసం అధికారులు ప్రజల సలహాలను కూడా కోరుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా ఈ పదార్థాన్ని చూసిన పలువురు ఇది ఒక చేప గుడ్డు ఆకారాన్ని పోలి ఉందని,ఇది స్క్విడ్‌ గుడ్డు కావచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్క్విడ్‌ గుడ్లను తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టాలని అధికారులకు సూచించారు.